Share News

పిల్ల సైకోకు పెద్ద సైకో పరామర్శ: బుద్దా వెంకన్న

ABN , Publish Date - Feb 20 , 2025 | 03:32 AM

విజయవాడలో ఆయన మాట్లాడుతూ జైల్లో ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించి జగన్‌ చరిత్ర హీనుడయ్యాడన్నారు.

పిల్ల సైకోకు పెద్ద సైకో పరామర్శ:  బుద్దా వెంకన్న

విజయవాడ(వన్‌టౌన్‌), ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): అధికార మదంతో ఆనాడు వాగిన వైసీపీ వారంతా జైలుకెళ్తారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చెప్పారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ జైల్లో ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించి జగన్‌ చరిత్ర హీనుడయ్యాడన్నారు. పిల్ల సైకోను పరామర్శించేందుకు పెద్ద సైకో వచ్చాడని ఎద్దేవా చేశారు. నందిగం సురేశ్‌ను జగన్‌ ఎందుకు కలవలేదని ప్రశ్నించారు. ఒక పథకం ప్రకారం జగన్‌ కిరాయి మూకలను వెంట బెట్టుకుని విజయవాడలో బీభత్సం చేయాలనే ఆలోచనతోనే జగన్‌ వచ్చారని, అయితే, పోలీసులు పసిగటి ఎక్కడిక్కడ అదుపు చేశారని చెప్పారు. పోలీసుల బట్టలు ఊడదీస్తాన నడంతోనే జగన్‌ నైజం స్పష్టమైందన్నారు. ఈసారి పులివెందులలో కూడా జగన్‌ ఓటమి ఖాయమన్నారు.

Updated Date - Feb 20 , 2025 | 03:32 AM