Nara Lokesh: టీసీఎస్ గేమ్ చేంజర్
ABN , Publish Date - Apr 17 , 2025 | 03:56 AM
టీసీఎస్ విశాఖలో ఐటీ రంగానికి చోదక శక్తి, ఐటీ హబ్‌గా నగరం రూపుదిద్దుకోవడం. ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాల కల్పనకు మంత్రి లోకేశ్ ఆదేశాలు.

రాష్ట్ర ఐటీ రంగానికి చోదక శక్తి
ఐటీ హబ్‌గా విశాఖపట్నం
ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు: లోకేశ్
అమరావతి, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): ఐటీ రంగంలో రాష్ట్ర గేమ్ చేంజర్‌గా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) మారుతుందని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. విశాఖలో 21.6 ఎకరాల భూమిని టీసీఎ్‌సకు కేటాయించడంతో రాష్ట్ర ఐటీ రంగానికి ప్రత్యేక శక్తి వచ్చిందన్నారు. ఐటీ హబ్‌గా విశాఖ రూపుదిద్దుకుంటోందని పేర్కొన్నారు. రానున్న ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ఐటీ రంగాన్ని విస్తృతం చేసే చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ఎన్నికల సమయంలో రాష్ట్రంలో ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేరుస్తామని తెలిపారు. ఇందులో భాగంగా ఐటీ, ఎలకా్ట్రనిక్స్ రంగాల్లో 5 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు కార్యాచరణను రూపొందిస్తున్నామని లోకేశ్ పేర్కొన్నారు. గడచిన ఐదేళ్లు రాష్ట్రంలో ఐటీ రంగం ఉనికి లేకుండా పోయిందని, కూటమి హయాంలో రాష్ట్రంలో సాంకేతిక రంగాన్ని విస్తరిస్తామని తెలిపారు.