Share News

Former CID Chief Suspension: పీవీ సునీల్‌ సస్పెన్షన్‌ పొడిగింపు

ABN , Publish Date - Apr 29 , 2025 | 05:26 AM

సీఐడీ మాజీ చీఫ్‌ పీవీ సునీల్‌కుమార్‌ సస్పెన్షన్‌ను రాష్ట్ర ప్రభుత్వం మరో నాలుగు నెలల పాటు పొడిగించింది. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లిన ఆయనపై సర్వీస్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకుంది

Former CID Chief Suspension: పీవీ సునీల్‌ సస్పెన్షన్‌ పొడిగింపు

అమరావతి, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): సీఐడీ మాజీ చీఫ్‌ పీవీ సునీల్‌కుమార్‌ సస్పెన్షన్‌ను రాష్ట్ర ప్రభుత్వం మరో నాలుగు నెలలు పొడిగించింది. ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించేలా విదేశీ పర్యటనలకు వెళ్లిన ఆయన, అఖిల భారత సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారంటూ ఇప్పటికే వేటు పడింది. రివ్యూ కమిటీ సిఫారసుల మేరకు ఆగస్టు 28 వరకూ సస్పెన్షన్‌ను పొడిగిస్తూ సీఎస్‌ విజయానంద్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జగన్‌ ప్రభుత్వ హయాంలో పీవీ సునీల్‌కుమార్‌ 2019 డిసెంబరు నుంచి 2024 మార్చి వరకూ పలుమార్లు విదేశీ పర్యటనలకు వెళ్లొచ్చారు. అమెరికా వెళ్లేందుకు అనుమతి తీసుకుని జార్జియాకు.. యూకే వెళుతున్నానంటూ దుబాయ్‌ వెళ్లొచ్చారు. ఉన్నతస్థానంలో ఉన్న సీనియర్‌ ఐపీఎస్‌ దేశం దాటి వెళ్లాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఆయన భద్రతతోపాటు దేశభద్రతకు సంబంధించిన విషయాలు సీఐడీ అధిపతి లాంటి వారికి తెలుస్తాయి గనుక ప్రభుత్వ అనుమతి లేకుండా దేశం దాటకూడదు. డీజీపీ ర్యాంకు అధికారి అలా వెళ్లడాన్ని సీరియ్‌సగా పరిగణించిన కూటమి ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకుంది.


ఇవి కూడా చదవండి

Guntur Mayor Election: గుంటూరు మేయర్ ఎన్నిక.. వైసీపీ అభ్యర్థి నామినేషన్

Visakhapatnam Mayor: విశాఖ మేయర్‌ ఎన్నిక ఏకగ్రీవం

Read latest AP News And Telugu News

Updated Date - Apr 29 , 2025 | 05:26 AM