AP Govt Officials: ప్రధాని పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
ABN , Publish Date - Apr 20 , 2025 | 05:34 AM
ప్రధాని మోదీ పర్యటనకు గన్నవరం విమానాశ్రయంలో కలెక్టర్ డీకే బాలాజీ నేతృత్వంలో పకడ్బందీ ఏర్పాట్లు. అధికారులు సమన్వయం తీసుకొని అన్ని ఏర్పాట్లను కట్టుదిట్టంగా చేయాలని ఆదేశించారు

కలెక్టర్ డీకే బాలాజీ
గన్నవరం విమానాశ్రయంలో అధికారులతో సన్నాహక సమావేశం
గన్నవరం, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గన్నవరం విమానా శ్రయంలో శనివారం ఎస్పీ ఆర్.గంగాధరరావు, జేసీ గీతాంజలి శర్మతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ మే 2వ తేదీన అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు పునఃప్రారంభం సందర్భంగా గన్నవరం విమానా శ్రయానికి వస్తున్నారని చెప్పారు. అధికారుల ందరూ సమన్వయంతో పనిచేసి ఎలాంటి లోటు పాట్లు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాల న్నారు. ప్రధానితో పాటు పలువురు గవర్నర్‌లు, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు విమానాశ్రయానికి రానున్నారని చెప్పారు. జిల్లాలో వారు పర్యటించే ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రోటోకాల్ ప్రకారం గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా పర్యవేక్షించాలని చెప్పారు. నిర్ధేశిత ప్రాంతల్లో మంచినీటి సౌకర్యం కల్పించాలన్నారు. కంట్రోల్ విభాగం, అంతర్జాలం కనెక్షన్‌లు ఏర్పాటు చేసి పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు స్పందించాలనా ్నరు. ప్రముఖులు విమానాశ్రయానికి వస్తున్న నేపథ్యంలో ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా వీలైనంత తొందరగా ముందుగానే విమానాశ్రయం చేరుకునే విధంగా అన్ని మార్గాల్లో సమాచారం ఇవ్వాలన్నారు.
వచ్చే ప్రముఖులకు రవాణా, వసతి ఏర్పాట్లు పక్కాగా చేయాల న్నారు. బ్లూ పుస్తకం ప్రకారం తాత్కాలిక ప్రధాన మంత్రి కార్యాలయ సెటప్‌ను ఎస్పీజీ వారు వచ్చాక చర్చించి ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలో ఏ విధులు నిర్వహిం చాలో త్వరలో చెబుతామన్నారు. పాములు పట్టేవారి పేర్లు వివరాల జాబితా పోలీసుల ఆమోదం కోసం ముందుగా అందజే యాలన్నారు. ప్రముఖులు విమానాశ్రయం నుంచి విజయ వాడ, అమరావతికి చేరుకునే మార్గాల్లో రాకపోకలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసు కోవాల న్నారు. ఎస్పీ ఆర్.గంగాధరరావు మాటా ్లడుతూ ప్రభుత్వ అధికారు లు వారి తరపున ఎవరినైన వివిధ పనుల కోసం నియమిం చుకుంటే వారి పూర్తి వివరాలు అందజేసి గుర్తింపు కార్డులు పొందాల న్నారు. గుడివాడ ఆర్డీవో బాలసుబ్రహ్మణ్యం, డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ శర్మిష్ట, ఆర్‌అండ్‌బీ అధికారి లోకేష్, ఆర్టీవో శ్రీనివాస్, డీఎస్‌వో పార్వతి, డీఎఫ్‌వో సునీత, విమానాశ్రయ సహాయ మేనేజర్ శ్రీలేఖ, డీఎస్పీ చలసాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.