Share News

CM Chandrababu On Kasibugga Tragedy: తొక్కిసలాట ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Nov 01 , 2025 | 12:54 PM

కాశీబుగ్గలోని వేంకటేశ్వర స్వామి దేవస్థానం తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

CM Chandrababu On Kasibugga Tragedy:  తొక్కిసలాట ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు
CM Chandrababu On Kasibugga Tragedy

శ్రీకాకుళం జిల్లా: కాశీబుగ్గలోని వేంకటేశ్వర స్వామి దేవస్థానం తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో స్పందించారు. ఈ దురదృష్టకర ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.


ఆలయ తొక్కిసలాట దుర్ఘటనపై హోం మంత్రి అనిత కూడా స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన గురించి అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హోం మంత్రి అనిత పేర్కొన్నారు.


కాగా, ఏకాదశి రోజున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తొక్కిసలాట జరిగి దాదాపు 10 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.


Also Read:

డిగ్రీ విద్యార్థిని అనుమానాస్పద మృతి

నాలాల కబ్జాలను ఉపేక్షించొద్దు

Read Latest Andhra Pradesh News

Updated Date - Nov 01 , 2025 | 02:54 PM