Share News

Speaker Ayyanna Patrudu : ఎమ్మెల్యేలకు క్రీడా సాంస్కృతిక పోటీలు

ABN , Publish Date - Mar 05 , 2025 | 06:36 AM

‘ఈ నెల 18, 19, 20 తేదీల్లో... ఎమ్మెల్యేలకు ప్రత్యేక క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాం.

Speaker Ayyanna Patrudu : ఎమ్మెల్యేలకు క్రీడా సాంస్కృతిక పోటీలు

  • 18, 19, 20 తేదీల్లో నిర్వహణ: స్పీకర్‌ అయ్యన్న

అమరావతి, మార్చి 4(ఆంధ్రజ్యోతి): ‘ఈ నెల 18, 19, 20 తేదీల్లో... ఎమ్మెల్యేలకు ప్రత్యేక క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాం. సభ్యులందరూ పాల్గొనాలి. ఎమ్మెల్యేలకు కూడా ఆటవిడుపు ఉండాలనే ఉద్దేశంతో ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నాం’ అని స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు అన్నారు. మంగళవారం అసెంబ్లీలో మాట్లాడుతూ, ‘పురుషులు, స్త్రీలకు వేరుగా వేరుగా పోటీలు ఉంటాయి. క్రికెట్‌, వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌, టెన్నిస్‌, టెన్నికాయిట్‌, త్రో బాల్‌ తదితర ఆటలతో పాటు సాంస్కతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. పాటల, నాటకాల పోటీలు ఉంటాయి. 20న సాయంత్రం విజేతలకు బహుమతుల ప్రదానం చేస్తాం. ప్రతి ఎమ్మెల్యే ఈ పోటీల్లో భాగస్వాములు కావాలి’ అని స్పీకర్‌ విజ్ఞప్తి చేశారు.

Updated Date - Mar 05 , 2025 | 06:36 AM