Srikakulam: ఆరు కుటుంబాల సాంఘిక బహిష్కరణ
ABN , Publish Date - Jun 24 , 2025 | 06:23 AM
సామాజిక వర్గ సమావేశానికి హాజరు కాలేదంటూ ఆరు కుటుంబాలను వెలి వేసిన ఘటన శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో జరిగింది

హరిపురం, జూన్ 23(ఆంధ్రజ్యోతి): సామాజిక వర్గ సమావేశానికి హాజరు కాలేదంటూ ఆరు కుటుంబాలను వెలి వేసిన ఘటన శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో జరిగింది. మందస మండలం మఖరజోల పంచాయతీ అల్లిమెరక కాలనీలో ఉప్పర సామాజిక వర్గానికి చెందిన సుమారు 65 కుటుంబాలు ఏటా జూన్ 19న సమావేశం ఏర్పాటు చేసుకుని, పలు అంశాలపై మాట్లాడుకుంటాయి. ఈ ఏడాది సమావేశానికి నక్క రామారావు, గజ్జెల వల్లభరావు, నక్క బాలకృష్ణ, నక్క డిల్లేశ్వర్రావు, నక్క సింహాచలం, నక్క లోకేశ్వర్రావు హాజరుకాలేదు. దీంతో ఈ ఆరు కుటుంబాలను వెలివేస్తూ.. కులపెద్దలు తీర్పునిచ్చారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బాధితులు సన్నద్ధమవుతున్నారు.