Weak Monsoon: తీవ్రంగా ఎండ.. బలహీనంగా రుతుపవనాలు
ABN , Publish Date - Jul 30 , 2025 | 04:36 AM
రాష్ట్రంలో రుతుపవనాలు పూర్తిగా బలహీనపడ్డాయి. బంగాళాఖాతం నుంచి తేమగాలులు భూ ఉపరితలంపైకి రావట్లేదు

జంగమహేశ్వరపురంలో 37 డిగ్రీల ఉష్ణోగ్రత
విశాఖపట్నం, జూలై 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రుతుపవనాలు పూర్తిగా బలహీనపడ్డాయి. బంగాళాఖాతం నుంచి తేమగాలులు భూ ఉపరితలంపైకి రావట్లేదు. అదే సమయంలో పడమర దిశ నుంచి వేడి గాలులు వీస్తున్నాయి. దీంతో మంగళవారం ఉదయం నుంచే ఎండ తీవ్రంగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3నుంచి 5డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. జంగమ హేశ్వరపురంలో 37 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24గంటల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షా లు కురుస్తాయని, మిగిలిన ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. మరో మూడు, నాలుగు రోజులు ఎక్కువ ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది.