AP Liquor Scam: అడ్డంగా దొరికిన వైసీపీ గ్యాంగ్, ఏబీఎన్ దగ్గర డబ్బు కట్టల సంచలన వీడియో
ABN , Publish Date - Aug 02 , 2025 | 09:21 PM
ఏపీలో వైఎస్ జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో వైసీపీ గ్యాంగ్ అడ్డంగా బుక్కైంది. దీంతో చెవిరెడ్డి గ్యాంగ్ మొత్తం బాగోతం బట్టబయలైనట్లైంది. డబ్బుల డెన్ లో వెంకటేష్ నాయుడు వీడియోను అతని ఫోన్ నుంచి రిట్రీవ్..

అమరావతి, ఆగష్టు 2: ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో వైసీపీ గ్యాంగ్ అడ్డంగా బుక్కైంది. దీంతో చెవిరెడ్డి గ్యాంగ్ మొత్తం బాగోతం బట్టబయలైనట్లైంది. డబ్బుల డెన్ కు సంబంధించి వెంకటేష్ నాయుడు ఫోన్ నుంచి వీడియోను రిట్రీవ్ చేశారు సిట్ అధికారులు. ఆ వీడియోలో మద్యం ముడుపుల డెన్ లో నోట్ల కట్టలతో చెవిరెడ్డి పీఏ వెంకటేష్ నాయుడు సిట్ కు అడ్డంగా దొరికిపోయాడు. వెంకటేష్ నాయుడు ఫోన్ నుంచి రిట్రీవ్ చేసిన వీడియోలో డబ్బుల డెన్ లో నోట్ల కట్టలు లెక్కించుకుంటూ ఉన్న వీడియో సంచలనం రేపుతోంది.
కాగా, ఈ కేసులో ఇప్పటికే వెంకటేష్ నాయుడు ను సిట్ అరెస్ట్ చేసింది. ఇప్పటివరకూ తనకు మద్యం వ్యాపారంతో సంబంధం లేదని వైసీపీ కీలకనేత చెవిరెడ్డి భూకాయిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. చెవిరెడ్డికి అత్యంత సన్నిహితుడైన వెంకటేష్ నాయుడు డెన్ లో దొరకటంతో ఈ కేసు ఇప్పుడు మరింత రసవత్తరంగా మారింది. ఈ దెబ్బతో చెవిరెడ్డి అడ్డంగా బుక్ అయినట్టేనని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఏబీఎన్ వద్ద ఉన్న ఈ మద్యం ముడుపుల సంచలన వీడియో దిగువ చూడవచ్చు.
ఇదిలాఉంటే, ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంకి సంబంధించి ఇటీవల పట్టుబడిన రూ.11 కోట్లు బ్యాంకులో సిట్ అధికారులు ఇవాళ(శనివారం) డిపాజిట్ చేశారు. ఆ నోట్లను వీడియో తీయాలని, విడిగానే ఉంచాలని ఏసీబీ కోర్టులో రాజ్ కసిరెడ్డి తరపు న్యాయవాదులు పిటిషన్ వేశారు. అన్ని నోట్ల కట్టలను ఫొటోలు, వీడియో తీయించినట్లు కోర్టుకు సిట్ అధికారులు తెలిపారు. బ్యాంకులో డిపాజిట్ చేసిన రూ.11 కోట్లను విడిగానే భద్రపరచాలని సిట్‌కు ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల కాపీలను బ్యాంకు అధికారులకు కసిరెడ్డి తరఫు న్యాయవాదులు అందజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
అమర్నాథ్ దిగజారి మాట్లాడుతున్నారు.. ఎంపీ శ్రీభరత్ ఫైర్
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్‌బాస్ అరెస్ట్ ఖాయం
Read Latest AP News and National News