Pawan Kalyan Son: కోలుకుంటున్న మార్క్ శంకర్
ABN , Publish Date - Apr 10 , 2025 | 03:39 AM
సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌ను ఐసీయూ నుంచి సాధారణ రూమ్‌కి తరలించారు. సమ్మర్ క్యాంప్ సందర్భంగా ప్రమాదం జరిగింది.

మరో మూడు రోజులు డాక్టర్ల పర్యవేక్షణలోనే
ఐసీయూ నుంచి వార్డుకు మార్చిన వైద్యులు
సింగపూర్‌లో ఆస్పత్రికి డిప్యూటీ సీఎం పవన్
కుమారుడి ఆరోగ్యంపై వైద్యుల వద్ద ఆరా
అమరావతి, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ నెమ్మదిగా కోలుకుంటున్నాడు. ప్రమాద వార్త తెలిసి మంగళవారం రాత్రి సింగపూర్ బయల్దేరి వెళ్లిన పవన్ కల్యాణ్ బుధవారం నేరుగా తన కుమారుడు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడ కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మార్క్ శంకర్‌ను చూసిన అనంతరం ఆస్పత్రి వైద్యులతో మాట్లాడారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మార్క్ శంకర్ కోలుకొంటున్నాడని.. ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడం వలన మూడు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించాల్సి ఉంటుందని వారు పవన్ కల్యాణ్‌కు సూచించారు.
కాగా, బుధవారం ఉదయం మార్క్‌ను ఐసీయూ నుంచి సాధారణ రూమ్‌కి తరలించారు. పవన్ చిన్న కుమారుడు సింగపూర్‌లో సమ్మర్ క్యాంప్‌లో ఉండగా మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో అతని చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. దీంతో అతన్ని ఐసీయూలో ఉంచి చికిత్స అందించిన సంగతి తెలిసిందే.
Read Latest AP News And Telugu News