Share News

రజనీ అనుచరుడు శ్రీకాంత్‌రెడ్డికి బెయిల్‌

ABN , Publish Date - May 12 , 2025 | 05:03 AM

వైసీపీ నాయకురాలు విడదల రజనీ అనుచరుడు శ్రీకాంత్‌రెడ్డికి చిలకలూరిపేట కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అంగన్వాడీ కాంట్రాక్ట్‌కు సంబంధించి రూ.28 లక్షల మోసంతో అతన్ని అరెస్టు చేశారు

రజనీ అనుచరుడు శ్రీకాంత్‌రెడ్డికి బెయిల్‌

  • షరతులు విధించిన కోర్టు

చిలకలూరిపేట, మే 11(ఆంధ్రజ్యోతి): వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీ ప్రధాన అనుచరుడు మానుకొండ శ్రీకాంత్‌రెడ్డికి ఆదివారం చిలకలూరిపేట అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో బెయిల్‌ మంజూరైంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరా కాంట్రాక్టు ఇప్పిస్తామని రూ.28 లక్షలు తీసుకుని మోసం చేసినట్టు చిలకలూరిపేటకు చెందిన ఎం. రాత్నారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం శ్రీకాంత్‌ రెడ్డిని చిలకలూరిపేట రూరల్‌ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం, శ్రీకాంత్‌ రెడ్డిని పోలీసులు స్థానిక కోర్టులో హాజరు పరిచారు. వాదనలు విన్న జడ్జి శ్రీకాంత్‌ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేశారు. కాగా, శ్రీకాంత్‌ రెడ్డి అరెస్టుకు సంబంధించి మాజీ సీఎం జగన్‌ విడదల రజనీకి ఫోన్‌ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సొంత అన్నలా తోడుంటానంటూ జగన్‌ భరోసా ఇచ్చారు. పోలీసుల తీరుపై ఆయన ఆరా తీసినట్టు తెలిసింది.


ఇవి కూడా చదవండి..

పాక్ లో ప్రస్తుత పరిస్థితి .. చైనా శాటిలైట్ చిత్రాలు

Buddha Venkanna: విషపురుగు.. అందుకే దూరం పెట్టిన చంద్రబాబు

Operation Sindoor: మరికొద్ది గంటల్లో హాట్ లైన్ చర్చలు.. రంగం సిద్ధం..

Operation Sindoor: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పై ప్రధాని సంచలన వ్యాఖ్యలు

India Vs Pakistan: ప్రధాని మోదీకి రాహుల్ కీలక సూచన

Operation Sindoor: భారత సైన్యం రావల్పిండిలోనూ గర్జించింది: రాజ్‌నాథ్ సింగ్

For Andhrapradesh news and Telugu News

Updated Date - May 12 , 2025 | 05:03 AM