అనుమతి రాగానే మెలియాపుట్టిలో ఐటీడీఏ: మంత్రి సంధ్యారాణి
ABN , Publish Date - Mar 04 , 2025 | 06:55 AM
శ్రీకాకుళం జిల్లాలోని మెలియాపుట్టి కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదన ఆర్థిక శాఖ వద్ద పరిశీలనలో ఉందని, అనుమతి రాగానే

Minister Gumidi Sandhya Rani: శ్రీకాకుళం జిల్లాలోని మెలియాపుట్టి కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదన ఆర్థిక శాఖ వద్ద పరిశీలనలో ఉందని, అనుమతి రాగానే ఏర్పాటవుతుందని గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. దీనిపై ఎమ్మెల్యేలు గౌతు శిరీష (పలాస), కూన రవికుమార్ (ఆమదాలవలస), గొండు శంకరరావు (శ్రీకాకుళం), బగ్గు రమణమూర్తి (నరసన్నపేట) అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. వైసీపీ ప్రభుత్వం అస్తవ్యస్తంగా చేసిన జిల్లాల పునర్విభజన కారణంగా గిరిజనులు ఇబ్బంది పడుతున్నారని.. రాష్ట్రమంతా ఒక్కో లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసి.. అరకు స్థానాన్ని మాత్రం రెండు జిల్లాలు చేశారన్నారు.
జీవో 3పై సుప్రీంకోర్టులో పిటిషన్
గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకు ఉద్యోగాలు కల్పించే జీవో 3 రద్దుపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ) వేస్తామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు (పోలవరం) అడిగిన ప్రశ్నకు పై విధంగా స్పందించారు.