Share News

Dr. Prabhavati Qestioned: మెడికల్ రిపోర్ట్ ఎందుకలా ఇచ్చారు.. ప్రభావతిని ప్రశ్నిస్తున్న ఎస్పీ

ABN , Publish Date - Apr 07 , 2025 | 04:10 PM

Dr. Prabhavati Qestioned: రఘురామ కృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో డాక్టర్ ప్రభావతి.. ఒంగోలు ఎస్పీ ఎదుట విచారణకు హాజరయ్యారు. మెడికల్ రిపోర్టు ఎందుకు మార్చారు.. ఎవరు మార్చమన్నారు అనే కోణంలో ప్రభావతిని పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Dr. Prabhavati Qestioned: మెడికల్ రిపోర్ట్ ఎందుకలా ఇచ్చారు.. ప్రభావతిని ప్రశ్నిస్తున్న ఎస్పీ
Dr. Prabhavati Qestioned

ప్రకాశం, ఏప్రిల్ 7: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి (Former Superintendent of Guntur Government Hospital Dr. Prabhavathi).. పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు (AP Deputy CM Raghuram Krishnam Raju) కస్టోడియల్ టార్చర్ కేసులో ఏ5గా ఉన్న ప్రభావతిని ఒంగోలు ఎస్పీ ఆధ్వర్యంలోని పోలీసుల బృందం ప్రశ్నిస్తోంది. ఈరోజు మధ్యాహ్నం సరిగ్గా 1:30 గంటలకు ఎస్పీ కార్యాలయంలోకి వెళ్లారు. గత రెండు గంటలుగా ప్రభావతిని ఎస్పీ దామోదర్ (SP Damodar) విచారిస్తున్నారు. రఘురామ ఒంటిపై గాయాలు లేవంటూ ప్రభావతి మెడికల్ రిపోర్టు ఇచ్చారు. దీంతో ఎవరి ఆదేశాలతో మెడికల్ రిపోర్టు అలా ఇచ్చారు, రిపోర్టు అలా ఇవ్వాలని ఎవరు చెప్పారన్న కోణంలో పోలీసులు ప్రశ్నిస్తున్నారు.


2021 మే 14న రఘురామకృష్ణం రాజుపై గుంటూరు సీఐడీ కార్యాలయంలో థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఆయన ఒంటిపై గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నా గానీ.. డాక్టర్ ప్రభావతి నివేదికను మార్చి కోర్టుకు సమర్పించారు. ఈ నేపథ్యంలో రఘురామ తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగం జరిగిందని గుంటూరు నగరపాలెం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నమోదైన కేసులో ప్రభావతి ఐదో నిందితురాలుగా ఉన్నారు. ఆమెన ఫిబ్రవరి 7న ఒకసారి విచారణకు పిలువగా.. విచారణకు ఆమె సరిగా స్పందించలేదు. దీంతో మరోసారి విచారణకు రావాల్సిందిగా ప్రభావతికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ప్రభావతి విచారణ నిమిత్తం ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. నేడు, రేపు ప్రభావతిని పోలీసులు విచారించనున్నారు. గతంలో విచారణకు వచ్చిన సమయంలో రఘురామకు సంబంధించిన మెడికల్ రిపోర్టును ఎందుకు మార్చాల్సి వచ్చిందన్న కోణంలో విచారణ జరిపినప్పటికీ అందుకు ప్రభావతి సరైన సమాధానం ఇవ్వనట్లు తెలుస్తోంది. అయితే ఈరోజు, రేపు జరిగే విచారణలో అయినా రాఘురామకు సంబంధించిన మెడికల్ రిపోర్టును మార్చి కోర్టుకు ఎందుకు నివేదిక ఇచ్చారు.. దీని వెనుక ఎవరు ఉన్నారని ప్రభావతి నోరు విప్పి చెబుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.


కాగా.. పోలీసుల విచారణకు ఈరోజు ఉదయం 10 గంటలకే ప్రభావతి ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. అయితే ఎస్పీ దామోదర్ బిజీ షెడ్యూల్ నేపథ్యంలో మధ్యాహ్నం 1:30 గంటలకు విచారణకు రావాల్సిందిగా ప్రభావతికి పోలీసులు తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో మీకోసం కార్యక్రమంతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ ఉండటంతో ఎస్పీగా బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఉదయం 10 గంటలకు ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ప్రభావతి ఆ వెంటనే తిరిగి వెళ్లిపోయారు. ఇప్పుడు సరిగ్గా 1:30 గంటలకు ప్రభావతి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.


ఇవి కూడా చదవండి

Prabhavati Investigation: విచారణకు వచ్చిన ప్రభావతి.. కానీ

YS Sharmila Criticizes AP Govt: నిలిచిన వైద్య సేవలు.. సర్కార్‌పై షర్మిల ఫైర్

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 07 , 2025 | 04:38 PM