Pollution Control Board: పర్యావరణ పరిరక్షణకు కాలుష్య నియంత్రణ బోర్డు కీలకం
ABN , Publish Date - May 24 , 2025 | 04:31 AM
పర్యావరణ పరిరక్షణలో కాలుష్య నియంత్రణ బోర్డు కీలక పాత్ర పోషిస్తోందని ఏపీపీసీబీ చైర్మన్ పి.కృష్ణయ్య తెలిపారు. విజయవాడలో నిర్వహించిన వర్క్‌షాప్‌లో పలు విభాగాల నిపుణులు పాల్గొన్నారు.

రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు చైర్మన్ పి.కృష్ణయ్య
విజయవాడ, మే 23 (ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కీలకపాత్ర పోషిస్తుందని ఏపీపీసీబీ చైర్మన్ పి.కృష్ణయ్య అన్నారు. శుక్రవారం విజయవాడలోని ఓ హోటల్‌లో ఏర్పాటుచేసిన వర్క్‌షాపులో ఆయన మాట్లాడుతూ, భూమ్మీద పేరుకుపోతున్న వ్యర్థాలను తొలగించడంలో బాధ్యతాయుతమైన పాత్ర నిర్వహించడంతో పాటు ఈ రంగంలో ఉద్యోగాలను పెంపొందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. అందులో భాగంగానే బోర్డు నిర్వహించిన వర్కుషాపులో పలు ఐఐటీ, మెటీరియల్ రీసైక్లింగ్, పరిపత్రం సొల్యూషన్ నిపుణులతో ఎకానమీ, వినూత్న అవకాశాలు, మార్గాలను తెలుసుకోవడం కోసం నిపుణులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు వెల్లడించారు. ముఖ్యంగా రాష్ట్రంలో ప్లాస్టిక్, ఘన, బ్యాటరీ, ఫోటో వోల్టాయిక్, వేస్ట్ ఆయిల్, టైర్, మెటల్ వ్యర్థాలు గడువు ముగిసిన వాహనాలు వివిధ రకాల వ్యర్థాలకు సంబంధించిన చర్చాగోష్టి నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఏపీపీసీబీ సభ్యుడు శరవణన్, సుమారు 150 మంది వివిధ స్వచ్ఛంద సంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.