Share News

Pawan Kalyan: విజనరీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

ABN , Publish Date - Apr 21 , 2025 | 05:00 AM

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబును శుభాకాంక్షలు తెలిపారు. ఆర్థికంగా పతనమైన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి చంద్రబాబునాయుడిలాంటి విజనరీ నాయకుడే కావాలని పవన్‌ అన్నారు. ఆయన నిరంతర కృషిని కొనియాడారు

Pawan Kalyan: విజనరీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

  • సీఎం చంద్రబాబుకు హృదయపూర్వక శుభాకాంక్షలు: పవన్‌ కల్యాణ్‌

అమరావతి, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): ఆర్థికంగా కుంగిపోయి, అభివృద్ధి అగమ్యగోచరంగా తయారై, శాంతిభద్రతలు క్షీణించిపోయిన ఒక రాష్ట్ర ప్రగతిని పునర్జీవింప చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లాంటి దార్శనికునికి మాత్రమే సాధ్యమని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కొనియాడారు. విజనరీ లీడర్‌, పాలనాదక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘నాలుగో పర్యాయం సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న చంద్రబాబు విజన్‌, నిరంతరం పనిలో చూపే ఉత్సాహం అద్భుతం. భవిష్యత్తును ముందుగానే అంచనా వేసి అందుకు అనుగుణంగా వ్యవస్థలను నడిపించే విధానం స్ఫూర్తిదాయకం. వజ్రోత్సవ జన్మదిన శుభ సమయాన సీఎం చంద్రబాబుకు సంపూర్ణ ఆయురారోగ్యాలను, ఆనందాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా’ అని ప్రకటించారు. అలాగే, ఆంధ్రప్రదేశ్‌ సమగ్రాభివృద్ధికి కంకణబద్ధులైన గౌరవ సీఎం చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ మంత్రి నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు.

Updated Date - Apr 21 , 2025 | 05:00 AM