Panchayat Secretary Arrested: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పంచాయతీ కార్యదర్శి అరెస్టు
ABN , Publish Date - Apr 10 , 2025 | 04:37 AM
తిరుపతి జిల్లా చంద్రగిరి పంచాయతీ కార్యదర్శి మహేశ్వరయ్యను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అతని వద్ద రూ.85 కోట్ల విలువైన ఆస్తులు మరియు అక్రమంగా రూ.2.7 కోట్ల సంపాదన జరిగినట్టు వెల్లడైంది

తిరుపతి(నేరవిభాగం), ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లా చంద్రగిరి పంచాయతీ కార్యదర్శిగా లంచం తీసుకుంటూ పట్టుబడి సస్పెండైన మహేశ్వరయ్యను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. తిరుపతి ఏసీబీ అదనపు ఎస్పీ విమలకుమారి నేతృత్వంలో మంగళ, బుధవారాల్లో తిరుపతి, పలమనేరు, గంగవరం, కడప జిల్లా బద్వేలు, బెంగళూరులో అధికారుల బృందాలు ఏక కాలంలో సోదాలు చేశాయి. మహేశ్వరయ్యకు రూ.85 కోట్లకుపైగా ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. బుధవారం తనిఖీల్లోనూ కొన్ని డాక్యుమెంట్లను, అర కిలో బంగారాన్ని సీజ్ చేసినట్టు తెలిసింది. ఇప్పటి వరకు మహేశ్వరయ్య రూ.2,70,62,206 అక్రమార్జనకు పాల్పడినట్టు తేలిందని ఏసీబీ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహేశ్వరయ్యను అరెస్టు చేసి నెల్లూరులోని అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానం ఎదుట హాజరపరచగా, న్యాయమూర్తి రిమాండ్ విధించినట్టు అదనపు ఎస్పీ విమలకుమారి చెప్పారు.
Read Latest AP News And Telugu News