PSR Anjaneyulu bail: పీఎస్‌ఆర్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దు
ABN , Publish Date - Jul 18 , 2025 | 04:27 AM
గత ప్రభుత్వంలో అప్పటి ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్‌కు గురిచేయడంపై ..

రఘురామకు కస్టోడియల్ టార్చర్‌పై సుప్రీంకోర్టు సైతం ఆందోళన: హైకోర్టులో సిద్ధార్థ్ లూథ్రా
అమరావతి, జూలై 17(ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వంలో అప్పటి ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్‌కు గురిచేయడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసిందని సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇలాంటి తీవ్రమైన కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ముందస్తు బెయిల్ మంజూరు చేయడానికి వీల్లేదన్నారు. రఘురామను చిత్రహింసలకు గురిచేసిన వ్యవహారంలో గుంటూరు నగరంపాలెం పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం గురువారం విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫు న్యాయవాది నగేశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ... కేసు నమోదు చేసి చాలా కాలమైందన్నారు. రఘురామను చిత్రహింసలకు గురి చేశారనేది ఆరోపణ మాత్రమేనని అన్నారు. ప్రాసిక్యూషన్ తరఫున సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. పూర్తిస్థాయి వాదనలు వినిపించేందుకు విచారణను వాయిదా వేయాలని కోరారు. ఇరువైపుల వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు సింగిల్ జడ్జి... అనారోగ్య కారణాలతో పిటిషనర్ మధ్యంతర బెయిల్‌పై ఉన్నారని గుర్తుచేశారు. విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
CM Vs KTR: కేటీఆర్ మిత్రుడు దుబాయ్‌లో చనిపోయాడు: సీఎం రేవంత్