Nitin Gadkari Praises Chandrababu: చంద్రబాబు, పవన్‌లపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసలు
ABN , Publish Date - Aug 02 , 2025 | 09:03 PM
Nitin Gadkari Praises Chandrababu: శనివారం నాడు మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో పలు జాతీయ రహదారుల శంకుస్థాపన, జాతికి అంకితం చేసే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లపై ప్రశంసలు కురిపించారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు, పవన్‌లు ఏపీని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళుతున్నారని కొనియాడారు. శనివారం నాడు మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో పలు జాతీయ రహదారుల శంకుస్థాపన, జాతికి అంకితం చేసే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. ‘సీఎంగా చంద్రబాబు దేశానికి విజన్ చూపారు. కన్నును దానం చేయవచ్చు. విజన్‌ను చేయలేము. భవిష్యత్తుపై అవగాహన ప్రతి ఒక్కరికీ అవసరం.
నాలెడ్జిని వెల్త్‌గా మార్చేదే విజన్. ఏపీలో లక్ష కోట్ల పనులు చేస్తాం. రెండు నెలల్లోనే అమెరికాతో సమానంగా రోడ్లు తయారు అవుతాయి. నాయకత్వం, ప్రభుత్వం మంచిగా ఉంటే అభివృద్ధి సాధ్యం అవుతుంది. పోలవరానికి హెలికాప్టర్‌లో వెళ్లినప్పుడు ఎంతో నీరు సముద్రంలో కలిసిపోతుండటం చూశాం. గోదావరి నుంచి కావేరి వరకు నీటిని ఉపయోగించుకోవచ్చు. ఈ దేశంలో ఫుష్కలంగా నీరు ఉంది. నీటి వినియోగం సరిగా లేదు. నా దగ్గర ఏపీకి సంబంధించి అతిపెద్ద లిస్టు ఉంది. వెబ్ సైట్లో వాటి వివరాలు(రోడ్ ప్రాజెక్టుల గురించి) ఉంచుతాము.
ఆరు నెలలకు ముందు జపాన్‌ను వెనక్కి నెట్టి మనం ఆ స్ధానానికి ఎగబాకాం. మన రైతులు కేవలం అన్నదాతలు మాత్రమే కాదు. ఇంధన దాతలు కూడా. గతంలో ఇథనాల్‌ను దేశీయ ఇంధనంలోకి తేవడం వల్ల ఎంతో ఖర్చు తగ్గింది. ఇదంతా రైతుల వల్లే సాధ్యం అయ్యింది. నేను ఏది చెపుతానో.. అది చేసి చూపుతా. అందులో సందేహం లేదు. ఇథనాల్‌ను డీజిల్‌లోనే కాదు ఎయిర్ ఫ్యూయల్‌లో కూడా చూస్తున్నాం. నేను ఎలక్టిక్ కార్‌ను ప్రారంభించినప్పుడు కొందరు పాత్రికేయలు కారు ఆగిపోతే ఏం చేస్తారని అడిగారు. ఇప్పుడు ఏకంగా ఎలక్ట్రిక్ బస్సులు కూడా వచ్చాయి. బ్యాటరీల తయారీల్లో నూతన మార్గాలు వచ్చాయి. అయిదేళ్లలో భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీ చాలా ముందుకు వెళుతుంది’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
నడిరోడ్డుపై పాముతో హల్‌చల్.. లేడీ పోలీస్ పరుగో పరుగు..
హీరోయిన్ రమ్యకు అత్యాచార బెదిరింపులు.. ఇద్దరు అరెస్ట్..