New Liquor Policy: మందు బాబులకు గుడ్ న్యూస్
ABN , Publish Date - Aug 04 , 2025 | 06:41 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. గీత కార్మిక వర్గాలకు 10 శాతం షాపులు కేటాయించాలని నిర్ణయించారు.

అమరావతి, ఆగస్ట్ 04: రాష్ట్రంలో మద్యం పాలసీ గడువు మరి కొద్ది రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త మద్యం విధానాన్ని అమలు చేయాలని చంద్రబాబు సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా కొత్త మద్యం విధానాన్ని సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రి వర్గ ఉప సంఘం నివేదిక ఆధారంగా ఈ కొత్త మద్యం విధానాన్ని అమలు చేయనుంది.
మద్యం పాలసీ అంటే ఆదాయం కాదు.. ప్రజల ఆరోగ్యం ముఖ్యమనే విధంగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దీంతో అల్కాహాల్ కంటెంట్ తక్కువ ఉండే మద్యం విక్రయాలతో నష్టం తగ్గించ వచ్చునని భావిస్తుంది. అంటే.. మద్యం కారణంగా పేదల ఇళ్లు, ఒళ్లు గుల్లా కాకుండా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ క్రమంలో బార్లలో కూడా గీత కార్మిక వర్గాలకు 10 శాతం షాపులు కేటాయించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
ప్రభుత్వ వైద్యులకు రిజర్వేషన్లు..
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పీజీ వైద్య విద్య ప్రవేశాల్లో ప్రభుత్వ వైద్యులకు రిజర్వేషన్లను ఖరారు చేశారు. 7 క్లినికల్ సబ్జెక్టుల్లో 15 శాతం, నాన్ క్లినికల్ సబ్జెక్టుల్లో 30 శాతం రిజర్వేషన్ వారికి కల్పించాలని నిర్ణయించారు. అయితే స్పెషలిస్టుల అవసరాలతోపాటు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యుల ఆకాంక్షల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రిజర్వేషన్లు కల్పించాలంటూ వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనపై సీఎం చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అరెస్ట్ చేయొచ్చు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
వారిపై చర్యలకు కాళేశ్వరం కమిషన్ కీలక సిఫార్స్
For More AP News and Telugu News