Nellore Police High Alert: నెల్లూరుపై ఉగ్రనీడలు.. పోలీసుల అలర్ట్
ABN , Publish Date - Apr 24 , 2025 | 12:59 PM
Nellore Police High Alert: నెల్లూరు జిల్లా కోర్టులో కొన్నేళ్ల క్రితం బాంబు పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. గుర్తుతెలియని వ్యక్తులు కుక్కర్‌లో బాంబు పెట్టి పేల్చారు. అదే తరహాలో కేరళ, తమిళనాడు, చిత్తూరులో కూడా సంఘటనలు చోటు చేసుకున్నాయి. దానిపై ఎన్‌ఐఏ విచారణ జరిపింది.

నెల్లూరు, ఏప్రిల్ 24: జిల్లాలో పోలీసులు (Nellore Police) అలర్ట్ అయ్యారు. జిల్లాపై ఉగ్రనీడలు ఉన్నాయన్న అనుమానంతో ఉగ్రనీడులు, స్లీపింగ్ సెల్స్‌పై ముమ్మరంగా ఆరా తీస్తున్నారు. జిల్లాలో ఉగ్రవాదులకు ఎవరైనా సపోర్టర్స్ ఉన్నారా అనే దానిపైనా విచారణ చేస్తున్నారు. జిల్లాలో విస్తృతంగా వాహనాలను తనిఖీలు చేస్తూ అనుమానితులను విచారిస్తున్నారు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాలతో పోలీసులు హై అలర్ట్ అయ్యారు. గత రెండు రోజులుగా వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. కొన్ని బృందాలను ఏర్పాట్లు చేసి ఆరా తీస్తున్న పరిస్థితి. గతంలో జిల్లాలో చోటు చేసుకున్న కొన్ని ఘటనల నేపథ్యంలో కూడా పోలీసులు అప్రమత్తమై విచారణ చేస్తున్నారు.
గతంలో బుచ్చిపాలెంకు చెందిన షేక్ ఇలియాజ్ అహ్మద్‌ను ఎన్‌ఐఏ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఆయనన్ను పట్టిస్తే రెండు లక్షల రివార్డు కూడా ఇస్తామని అప్పట్లో ఎన్‌ఐఏ చెప్పింది. షేక్ ఇలియాజ్ అహ్మద్.. పెద్ద సంఖ్యలో యువకులను నిజామాబాద్‌లో సాయుధ శిక్షణ ఇచ్చేవాడని.. మారణహోమాలకు కుట్రలు చేసినట్లు ఎన్‌ఐఏ అభియోగం మోపింది. ఎలాంటి ఆయుధాలు లేకుండా ప్రాణాలు తీసేలా శిక్షణ ఇవ్వడంలో నేర్పరి. ఇలియాజ్‌ను పట్టుకునేందుకు కొన్ని ఇళ్లలో సోదాలు చేసేందుకు గతంలో ఎన్‌ఐఏ బుచ్చిపాలెం వచ్చింది. అయితే అక్కడ కొంతమంది ముస్లిం యువకులు అడ్డగించి ఎన్‌ఐఏను లోపలకు రానీయకుండా అడ్డుకున్నారు. లోకల్ పోలీసులు వెళ్లినప్పటికీ ఎన్‌ఐఏ సోదాలు చేయలేకపోయారు.
Encounter: జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్: ఆర్మీ జవాన్ మృతి
అయితే ఇటీవల నాంపల్లి కోర్టులో ఉగ్రవాది షేక్ ఇలియాజ్ అహ్మద్ లొంగిపోయాడు. ప్రస్తుతం ఇతడు రిమాండ్‌లో ఉన్నాడు. నెల్లూరు జిల్లా కోర్టులో కొన్నేళ్ల క్రితం బాంబు పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. గుర్తుతెలియని వ్యక్తులు కుక్కర్‌లో బాంబు పెట్టి పేల్చారు. అదే తరహాలో కేరళ, తమిళనాడు, చిత్తూరులో కూడా సంఘటనలు చోటు చేసుకున్నాయి. దానిపై ఎన్‌ఐఏ విచారణ జరిపింది. ఈ పేలుడు వెనక ఉగ్రవాదుల హస్తం ఉండవచ్చని అప్పట్లో అనుమానాలు రేకెత్తాయి. ఈ క్రమంలో జిల్లాలో ఉగ్రవాద కార్యకలాపాలు ఏమైనా ఉన్నాయా, ఎవరైనా వచ్చి వెళ్తున్నారా, ఉగ్రవాదులకు సపోర్టర్స్ ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ జరుగుతోంది. డ్రోన్ క్యామ్‌తో పెద్దఎత్తున వెతుకులాట మొదలుపెట్టారు. రెండు రోజులుగా రేయింబవళ్లు కూడా పూర్తి స్థాయిలో వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించి పంపిస్తున్న పరిస్థితి. ఇక మరోవైపు పెహల్గామ్ ఉగ్రదాడిలో జిల్లాకు చెందిన మధుసూదన్ రావు చనిపోవడంతో జిల్లాలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాద కార్యకలాపాలపై పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
Gold Price Falls: లక్ష దిగువకు బంగారం
PSR Prisoner Number: జైలులో పీఎస్‌ఆర్ ప్రత్యేక అభ్యర్థన.. ఏంటంటే
Read Latest AP News And Telugu News