Gujarath Tour: గుజరాత్‌లో రెండో రోజు మంత్రి నారాయణ బృందం పర్యటన
ABN , Publish Date - Apr 21 , 2025 | 10:57 AM
ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణపు పనులు వేగం పుంజుకుంటున్నాయి. ఈ క్రమంలో అమరావతి నిర్మాణంలో భాగంగా రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి నారాయణతో పాటు ఉన్నతాధికారుల బృందం గుజరాత్‌లో పర్యటిస్తోంది. రెండో రోజు సోమవారం మంత్రి బృందం పర్యటన కొనసాగుతోంది.

అమరావతి: ఏపీ మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి నారాయణ, అధికారుల బృందం (Minister Narayana Delegation) పర్యాటన గుజరాత్ (Gujarat)లో రెందో రోజు (2nd Day) సోమవారం కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 8.30 గంటలకు అహ్మదాబాద్ శివారు గ్యాస్పూర్‌లో జిందాల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్‌ను మంత్రి బృందం సందర్శించింది. తర్వాత అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంను పరిశీలించనుంది. అమరావతిలో నిర్మించే స్పోర్ట్స్ సిటీలో భారీ క్రికెట్ స్టేడియం రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుంది. నరేంద్ర మోదీ స్టేడియంతో పాటు స్పోర్ట్స్ సిటీ పరిశీలించనున్నారు. అమరావతి నిర్మాణంలో భాగంగా పలు కట్టడాలు,ప్రాంతాల అధ్యయనానికి మంత్రి నారాయణ బృందం రెండు రోజుల గుజరాత్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.
Also Read..: అట్లాంటాలో ఘనంగా సీఎం చంద్రబాబు 75వ పుట్టినరోజు వేడుకలు
కాగా ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణపు పనులు వేగం పుంజుకుంటున్నాయి. ఈ క్రమంలో అమరావతి నిర్మాణంలో భాగంగా రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి నారాయణతో పాటు ఉన్నతాధికారుల బృందం గుజరాత్‌లో పర్యటిస్తోంది. ఆదివారం ఆ రాష్ట్రంలోని ఏక్తా నగర్‌లో సర్దార్ వల్లభాయి పటేల్ భారీ విగ్రహాన్ని మంత్రులు, ఉన్నతాధికారులు పరిశీలించారు. ఆ క్రమంలో పటేల్ విగ్రహ నిర్మాణానికి ఉపయోగించిన సాంకేతికతతోపాటు మెటీరియల్.. ఇతర అంశాలను నిర్మాణ సంస్థ ప్రతినిధులు, గుజరాత్ ఉన్నతాధికారులు.. మంత్రి నారాయణ బృందానికి సోదాహరణగా వివరించారు. అనంతరం అహ్మదాబాద్ శివారులో ఇంటర్నేషనల్ ఎకనామిక్ సిటీగా 860 ఎకరాల్లోసెజ్‌లు, కంపెనీలతో నిర్మించిన గిఫ్ట్ సిటీని ఈ బృందం సందర్శించింది. అమరావతిలో నిర్మించే భారీ విగ్రహాల కోసం పటేల్ విగ్రహ నిర్మాణాన్ని మంత్రి నారాయణ,సీఆర్డీయే కమిషనర్ కన్నబాబు, ఏడీసీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్థసారథి భాస్కర్‌తోపాటు గ్రీనింగ్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాసులు తదితర బృందం అధ్యయనం చేసింది.
గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ ప్రజలు కూటమికి పట్టం కట్టారు. దీంతో చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. దాంతో రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన పనుల్లో వేగం పెరిగింది. అయితే అమరావతి పునర్ నిర్మాణ పనులను మే 2వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
భారత్ పర్యటనకు అమెరికా ఉపాధ్యక్షుడు
For More AP News and Telugu News