Share News

Jagan Mohan Reddy: సరస్వతి పవర్‌ షేర్ల బదిలీ నిలిపివేత

ABN , Publish Date - Jul 30 , 2025 | 04:18 AM

సరస్వతి పవర్‌ కంపెనీ షేర్ల బదిలీ వ్యవహారంలో కన్నతల్లి, తోడబుట్టిన చెల్లిపై జగన్‌ చేసిన న్యాయపోరాటంలో

Jagan Mohan Reddy: సరస్వతి పవర్‌ షేర్ల బదిలీ నిలిపివేత

  • తల్లి, చెల్లిపై జగన్‌ వ్యాజ్యం.. ట్రైబ్యునల్‌లో అనుకూల తీర్పు

  • విజయలక్ష్మి ఢిల్లీ ట్రైబ్యునల్‌కు వెళ్లే చాన్స్‌

హైదరాబాద్‌, జూలై 29(ఆంధ్రజ్యోతి): సరస్వతి పవర్‌ కంపెనీ షేర్ల బదిలీ వ్యవహారంలో కన్నతల్లి, తోడబుట్టిన చెల్లిపై జగన్‌ చేసిన న్యాయపోరాటంలో ఆయనదే పైచేయి అయింది. హైదరాబాద్‌లోని నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌(ఎన్సీఎల్టీ) వేదికగా తల్లి వైఎస్‌ విజయలక్ష్మిపై చేసిన న్యాయపోరాటంలో జగన్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. సరస్వతి పవర్‌ కంపెనీలో జగన్‌, ఆయన భార్య భారతి, వారి కంపెనీ క్లాసిక్‌ రియాల్టీకి ఉన్న 51.01శాతం షేర్లను తల్లి విజయలక్ష్మి పేరిట బదిలీ చేయడాన్ని నిలిపేస్తూ ఎన్సీఎల్టీ మంగళవారం తీర్పు ఇచ్చిం ది. సరస్వతి పవర్‌లో 51.01 శాతం వాటా తమదేనని... ఈ వాటాను తమకు తెలియకుండా తల్లి, చెల్లి(షర్మిల) అక్రమంగా బదిలీ చేసుకున్నారని.. ఈ బదిలీని రద్దు చేసి తమ వాటాను పునరుద్ధరించాలని కోరుతూ జగన్‌, భారతి, క్లాసిక్‌ రియాల్టీలు ఎన్సీఎల్టీలో పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌లో అటు జగన్‌, ఇటు విజయలక్ష్మి, షర్మిల తరఫున వాదనలు మే 7న ముగిశాయి. ఈ నెల 15న తీర్పు రిజర్వు చేసిన ట్రైబ్యునల్‌ న్యాయమూర్తులు జస్టిస్‌ రాజీవ్‌ భరద్వాజ్‌, జస్టిస్‌ సంయజ్‌పురి తాజాగా ఉత్తర్వులు వెలువరించారు. ఇది తమ తండ్రి సంపాయించిన ఆస్తి కాదని.. చెల్లెలు షర్మిలపై ప్రేమ, అనురాగంతో సర్వసతి పవర్‌ కంపెనీలో తమకు ఉన్న 51.01 శాతం వాటాను ఈడీ కేసులు ముగిసిన తర్వాత ఇద్దామని అనుకున్నామని జగన్‌ గత వాదనల సందర్భంగా ట్రైబ్యునల్‌కు తెలిపారు. అయితే.. తల్లిపై ఒత్తిడి తెచ్చి చెల్లి తన పేరిట వాటాలు బదిలీ చేయించుకోవాలని చూస్తున్నారని పేర్కొన్నారు. చెల్లికి సరస్వతి పవర్‌లో వాటా ఇచ్చే ఉద్దేశం లేదని, దీంతో ఎంవోయూ, గిఫ్ట్‌ డీడ్‌ రద్దు చేసుకున్నానని జగన్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. జూలై 2న సరస్వతి పవర్‌ బోర్డు నిర్ణయం తీసుకుందని, తప్పుడు పత్రాలు సృష్టించిందని తెలిపారు. తల్లి, చెల్లి మోసం చేసి తన వాటా బదిలీ చేసుకున్నారని జగన్‌ పేర్కొన్నారు. ఈ వాదనలతో ఏకీభవించిన ఎన్సీఎల్టీ జగన్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కాగా, ప్రస్తుతం ఎన్సీఎల్టీ ఇచ్చిన తీర్పుపై వైఎస్‌ విజయలక్ష్మి.. ఢిల్లీలోని ఎన్సీఎల్‌ఏటీలో అప్పీల్‌ చేసుకునే అవకాశం ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి

గుడ్ న్యూస్.. రేషన్‌ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏనుగుల గుంపు కదలికలపై వాట్సాప్ ద్వారా హెచ్చరికలు.. పవన్ కల్యాణ్ న్యూ ప్లాన్

Read latest AndhraPradesh News And Telugu News

Updated Date - Jul 30 , 2025 | 04:18 AM