Share News

Nara Lokesh: విద్యావికాసానికి ‘సమగ్ర’ కృషి భేష్‌

ABN , Publish Date - Apr 20 , 2025 | 06:09 AM

సమగ్ర శిక్ష 25 ఏళ్ల శ్రేయస్సు ప్రస్థానం అభినందనీయమని మంత్రి నారా లోకేశ్‌ కొనియాడారు. విద్యా సంస్కరణల్లో భాగంగా అన్ని వర్గాల పాత్రకు అభినందనలు తెలిపారు

Nara Lokesh: విద్యావికాసానికి ‘సమగ్ర’ కృషి భేష్‌

  • ‘సమగ్ర శిక్ష’ 25 ఏళ్ల ప్రస్థానంపై మంత్రి నారా లోకేశ్‌ స్పందన

అమరావతి, ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల శారీరక, మానసిక, విద్యావికాసానికి 25 ఏళ్లుగా సమగ్ర శిక్ష చేస్తున్న కృషి ప్రశంసనీయమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘సమగ్ర విద్య’ ప్రయాణంలో భాగమైన ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం, సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, వివిధ సంస్థలు, సంఘాలకు అభినందనలు తెలిపారు. 25 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించిన సమగ్ర శిక్ష మరిన్ని లక్ష్యాలు చేరుకోవాలని ఆకాంక్షించారు. సమగ్ర శిక్ష పాతికేళ్ల ప్రస్థానాన్ని ‘మన బడి’ మాసపత్రికలో చక్కగా వివరించారని, ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణలు, పథకాలు, కార్యక్రమాలను ప్రచారం కల్పిస్తున్న సంపాదక బృందానికి అభినందనలు తెలిపారు.

Updated Date - Apr 20 , 2025 | 06:10 AM