Minister Ponguru Narayana: డిప్యుటేషన్లు నిలుపుదల చేయాలి
ABN , Publish Date - Jul 10 , 2025 | 05:30 AM
మునిసిపల్ పరిపాలన, అర్బన్ డెవల్‌పమెంట్ మునిసిపల్ కమిషనర్లుగా ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్లను నిలుపుదల చేయాలని రాష్ట్ర మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణను మునిసిపల్ కమిషనర్ల అసోసియేషన్ ప్రతినిధులు కోరారు

మంత్రి నారాయణకు మునిసిపల్ కమిషనర్ల అసోసియేషన్ విజ్ఞప్తి
విజయవాడ (వన్‌టౌన్), జూలై 9 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్ పరిపాలన, అర్బన్ డెవల్‌పమెంట్ మునిసిపల్ కమిషనర్లుగా ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్లను నిలుపుదల చేయాలని రాష్ట్ర మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణను మునిసిపల్ కమిషనర్ల అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం వారు మంత్రికి వినతి పత్రం సమర్పించారు. ఇతర శాఖల నుంచి మునిసిపల్ కమిషనర్లుగా విలీనం చేసుకోవటాన్ని కూడా నిరోధించాలన్నారు. అన్ని కేడర్ల మునిసిపల్ కమిషనర్‌లకు నిర్ణీత కాలవ్యవధిలో పదోన్నతులు కల్పించాలని కోరారు. మునిసిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధిపై శిక్షణకు అమరావతిలో శిక్షణా కేంద్రాన్ని నిర్మించేందుకు స్ధలం కేటాయించాలని సూచించారు. మునిసిపల్ కమిషనర్లపై పెండింగ్‌లో ఉన్న ఆర్ధికేతర అభియోగాల ఫైళ్లను సత్వరమే పరిష్కరించాలని కోరారు.