Minister Nimmala Rama Naidu: వెలిగొండ ఆయకట్టుకు వచ్చే ఏడాది జూన్ నుంచి నీరివ్వాలి
ABN , Publish Date - Apr 10 , 2025 | 04:45 AM
వెలిగొండ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి 2026 జూన్ నాటికి ఆయకట్టుకు నీరు అందించాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. మిగిలిన పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని వీడియో కాన్ఫరెన్స్‌లో స్పష్టం చేశారు

పనుల్లో వేగం పెంచాలి.. ఇంజనీర్లకు మంత్రి నిమ్మల ఆదేశం
అమరావతి, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది జూన్ నుంచి వెలిగొండ ప్రాజెక్టు కింద ఆయకట్టుకు నీరందించాలని.. ఈ లక్ష్యం నెరవేరేందుకు నిర్మాణ పనుల్లో వేగాన్ని పెంచాలని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. బుధవారం సచివాలయం నుంచి ఇంజనీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. సీఎం చంద్రబా బు నిర్దేశం మేరకు ప్రాజెక్టులో మిగిలిపోయిన పనులన్నిటినీ పూర్తి చేయాలని, దీనిపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలని స్పష్టం చేశారు. రూ.వేల కోట్ల విలువైన పనులు మిగిలి ఉండగా.. ఎన్నికల ముందు జగన్ హడావుడిగా ఉత్తుత్తి ప్రారంభోత్సవం చేసి.. ప్రజలను మోసగించారని ధ్వజమెత్తారు. నిర్వాసితులకు రూ.800 కోట్ల వరకు పరిహారం అందించాల్సి ఉండగా.. ఆయన ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని చెప్పారు. 2026 జూన్ నాటికి వెలిగొండ ఆయకట్టు రైతాంగానికి సాగునీరందించేలా నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Read Latest AP News And Telugu News