Ration Vehicle Insurance: రేషన్ వాహనాలకు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించండి
ABN , Publish Date - Apr 17 , 2025 | 05:40 AM
రేషన్ వాహనాలపై ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని ఈ ఏడాది కూడా ప్రభుత్వం చెల్లించాలని ఎండీయూ ఆపరేటర్లు మంత్రి నాదెండ్ల మనోహర్‌కు వినతి చేశారు. గత నాలుగేళ్లుగా చెల్లించిన విధంగా ఈసారి కూడా అదే కొనసాగించాలని కోరారు

మంత్రి నాదెండ్లకు ఎండీయూ ఆపరేటర్ల వినతి
అమరావతి, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): రేషన్ వాహనాలకు నాలుగేళ్లుగా చెల్లిస్తున్నట్లుగానే ఈ ఏడాది కూడా ఇన్సూరెన్స్ ప్రీమియం సొమ్మును చెల్లించాలని ఎండీయూ ఆపరేటర్లు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఎండీయూ ఆపరేటర్ల అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు రౌతు సూర్యనారాయణ నేతృత్వంలోని ప్రతినిధి బృందం బుధవారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను, కమిషనర్ సౌరభ్ గౌర్, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఎండీ జిలానీ సమూన్‌లను కలిసి వినతిపత్రాలు అందజేశారు.