Share News

Guntur: పవన్‌ కల్యాణ్‌, మార్క్‌ శంకర్‌పై అసభ్య పోస్టులు

ABN , Publish Date - Apr 17 , 2025 | 04:31 AM

పవన్ కల్యాణ్‌, ఆయన కుమారుడు మార్క్ శంకర్‌పై అసభ్య పోస్టులు పెట్టిన వ్యక్తిని కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు అల్లు అర్జున్ అభిమాని కాగా, మెగా ఫ్యామిలీపై ద్వేషంతో పోస్టులు చేసినట్లు వెల్లడించారు.

Guntur: పవన్‌ కల్యాణ్‌, మార్క్‌ శంకర్‌పై అసభ్య పోస్టులు

  • పోలీసుల అదుపులో కర్నూలు జిల్లా వాసి

  • నిందితుడు అల్లు అర్జున్‌ అభిమానిగా గుర్తింపు

గుంటూరు, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, ఆయన కుమారుడు మార్క్‌ శంకర్‌పై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో కర్నూలు జిల్లా గూడూరుకు చెందిన పుట్టపాశం రఘు అలియాస్‌ పుష్పరాజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్‌కుమార్‌ తెలిపిన వివరాలు.. ప్రత్తిపాడుకి చెందిన సాంబశివరావు ఫిర్యాదు మేరకు రఘుని రెస్టు చేశామన్నారు. రఘు.. అల్లు అర్జున్‌కు వీరాభిమాని అని తెలిపారు. 2024 ఎన్నికల సమయంలో అర్జున్‌ నంద్యాలకు వచ్చి వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలిపారు. దీంతో మెగా అభిమానులు అర్జున్‌ని విమర్శించారు. దీంతో రఘు.. మెగా కుటుంబంలోని వ్యక్తులపై అసభ్యకర పోస్టులు పెట్టేవాడని ఎస్పీ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 8న పవన్‌ కల్యాణ్‌ చిన్నకుమారుడు మార్క్‌ శంకర్‌కు సింగపూర్‌లో అగ్ని ప్రమాదం జరిగిందని, ఇదే అదునుగా మెగా కుటుంబంపై ద్వేషాన్ని వెళ్లగక్కుతూ అనుచిత వ్యాఖ్యలు పోస్టు చేశాడని తెలిపారు.

Updated Date - Apr 17 , 2025 | 04:32 AM