Liquor Scam: మద్యం కేసు నిందితులకు రిమాండ్ పొడిగింపు
ABN , Publish Date - Jun 18 , 2025 | 04:50 AM
మద్యం కుంభకోణంలో అరెస్టయి విజయవాడ జిల్లా జైల్లో ఉన్న నిందితులకు న్యాయస్థానం రిమాండ్‌ను పొడిగించింది. కుంభకోణంలో ప్రధాన సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డితో పాటు బాలాజీ గోవిందప్ప, సజ్జల శ్రీధర్‌రెడ్డి, పి.కృష్ణమోహన్‌రెడ్డి, కె.ధనుంజయ్‌రెడ్డి...

1 వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు
బెయిల్ పిటిషన్ల విచారణ వాయిదా
విజయవాడ, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో అరెస్టయి విజయవాడ జిల్లా జైల్లో ఉన్న నిందితులకు న్యాయస్థానం రిమాండ్‌ను పొడిగించింది. కుంభకోణంలో ప్రధాన సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డితో పాటు బాలాజీ గోవిందప్ప, సజ్జల శ్రీధర్‌రెడ్డి, పి.కృష్ణమోహన్‌రెడ్డి, కె.ధనుంజయ్‌రెడ్డి, పైలా దిలీప్, చాణక్యలను విజయవాడ ఏసీబీ కోర్టులో మంగళవారం హాజరుపరిచారు. వారికి జూలై ఒకటో తేదీ వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ న్యాయాధికారి పి.భాస్కరరావు ఉత్తర్వులు ఇచ్చారు. తనకు కొత్తగా పెళ్లయిందని, బెయిల్ మంజూరు చేయాలని దిలీప్ న్యాయాధికారికి విన్నవించుకున్నారు. శ్వాసలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, జైల్లో సరైన సదుపాయాలు లేవని న్యాయాధికారికి చెప్పిన కృష్ణమోహన్‌రెడ్డి.. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. కాగా, ఈ బెయిల్ పిటిషన్లపై విచారణను న్యాయాధికారి వాయిదా వేశారు. కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, దిలీప్, చాణక్య బెయిల్ పిటిషన్లపై విచారణను 19కి, ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి బెయిల్ పిటిషన్లపై విచారణను 20కి, బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్‌ను 23వ తేదీకి వాయిదా వేశారు.