Subsidized Fertilizers: సబ్సిడీ ఎరువులతో లింక్ ఉత్పత్తులు అంటగట్టడం నేరం
ABN , Publish Date - Jul 22 , 2025 | 06:10 AM
ఎరువుల కొనుగోలు సమయంలో లింక్ ఉత్పత్తులు కొనలేక ఇబ్బందిపడుతున్న రైతాంగానికి కేంద్ర రసాయనాలు..

ఫిర్యాదులొస్తే చర్యలు: కేంద్రం
గుంటూరు సిటీ, జూలై 21( ఆంధ్రజ్యోతి): ఎరువుల కొనుగోలు సమయంలో లింక్ ఉత్పత్తులు కొనలేక ఇబ్బందిపడుతున్న రైతాంగానికి కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ శుభవార్త చెప్పింది. ఇక మీదట రైతులు సబ్సిడీ మీద లభ్యమయ్యే యూరియా, డీఏపీ వం టి ఎరువులతో పాటు లింక్ ఉత్పత్తులుగా భావించే నానో, బయో స్టి మ్యూలెంట్స్ కొనాల్సిన అవసరం లే దని స్పష్టం చేసింది. ఆమేరకు కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అనీతా సీ మేష్రామ్ సోమవారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఎరువులను 1955 నిత్యావసర వస్తువుల చట్టం కింద చేర్చి నందువల్ల లింక్ ఉత్ప త్తులు అంటగట్టటం నేరం కిందకు వస్తుందని అదనపు కార్యదర్శి అనీ తా సీ మేష్రామ్ స్పష్టం చేశారు. అటువంటి ఫిర్యాదులు వేస్త సదరు కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖను ఆదేశించా రు. కొద్ది రోజులుగా లింక్ ఉత్పత్తుల కొనుగోలు వ్యవహారంలో కంపెనీల కు, డీలర్లకు వివాదం నడుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆర్టీఐలో సామాజిక న్యాయం ఎక్కడ? ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న..
రేవంత్ నాటుకోడి.. కేటీఆర్ బాయిలర్ కోడి
Read latest Telangana News And Telugu News