శ్రీశైలంలో నందీశ్వర స్వామికి పూజలు
ABN , Publish Date - Apr 26 , 2025 | 01:03 AM
శ్రీశైల క్షేత్రంలో శుక్రవారం త్రయోదశి ఘడియలను పురస్కరించుకొని సాయంప్రదోషకాలంలో ఆలయంలోని మల్లికార్జునస్వామికి అభిముఖంగా కొలువై ఉన్న నందీశ్వరస్వామికి విశేష అభిషేకం, అర్చనలు జరిపించారు.

శ్రీశైలం, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): శ్రీశైల క్షేత్రంలో శుక్రవారం త్రయోదశి ఘడియలను పురస్కరించుకొని సాయంప్రదోషకాలంలో ఆలయంలోని మల్లికార్జునస్వామికి అభిముఖంగా కొలువై ఉన్న నందీశ్వరస్వామికి విశేష అభిషేకం, అర్చనలు జరిపించారు. లోక కల్యాణార్థం శుక్రవారం స్వామి, అమ్మవార్లకు ఊయల సేవ నిర్వహించారు. శ్రీశైల క్షేత్ర గ్రామదేవత అంకాలమ్మకు శుక్రవారం లోకకల్యాణాన్ని ఆకాంక్షిస్తూ విశేష పూజలను దేవస్థానం నిర్వహించింది.
మహానంది క్షేత్రంలో..
మహానంది: మహానంది క్షేత్రంలో చైత్ర బహుళ త్రయోదశి మహా ప్రధోషం సందర్భంగా శుక్రవారం సాయంత్రం ప్రధాన ఆలయంలోని రాతి నందీశ్వరునికి ఘనంగా ప్రదోషకాల నంధీశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్బంగా ఆలయ వేదపండితులు నాగేశ్వరశర్మ, హనుమంత్‌శర్మతో పాటు అర్చకులు రఘుశర్మ, పుల్లూరి జనార్దన్ శర్మ వేదమంత్రాలతో నందీశ్వరుడికి అభిషేక పూజలను నిర్వహించారు. అలాగే రాత్రి ఆలయ ప్రాంగణంలోని కల్యాణమంటపంలో పల్లకీ సేవ నిర్వహించారు. ఆలయ ఇన్‌స్పెక్టర్ పసుపుల సుబ్బారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.