Share News

విద్యాభివృద్ధికి కృషి

ABN , Publish Date - Jul 31 , 2025 | 12:15 AM

విద్యాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని పారిశ్రామికవేత్త, ఆవుల పుల్లారెడ్డి చారిటబుల్‌ ట్రస్టు అధినేత ఆవుల వెంకటనారాయణ రెడ్డి అన్నారు.

విద్యాభివృద్ధికి కృషి
తరగతి గదిని ప్రారంభిస్తున్న వెంకటనారాయణరెడ్డి

ఆత్మకూరు, జూలై 30(ఆంధ్రజ్యోతి): విద్యాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని పారిశ్రామికవేత్త, ఆవుల పుల్లారెడ్డి చారిటబుల్‌ ట్రస్టు అధినేత ఆవుల వెంకటనారాయణ రెడ్డి అన్నారు. ఈ ఏడాది జనవరిలో ఆత్మకూరులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల స్వర్ణోత్సవాల సమయంలో రూ.15 లక్షల వ్యయంతో కళాశాలలో అవసరమైన రెండు ఒకేషనల్‌ తరగతి గదులను నిర్మిస్తానని వెంకటనారాయణరెడ్డి హామీ ఇచ్చారు. నిర్మాణం పూర్తి కావడంతో బుధవారం తరగతి గదులను వెంకటనారాయణరెడ్డి, జయసుధ దంపతులు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1986-87లో తాను ఇదే కళాశాలలో సీఈసీ చదివానని చెప్పారు. తన తల్లిదండ్రులు ఆవుల పుల్లారెడ్డి, రామకోటమ్మ దంపతుల జ్ఞాపకార్థం రూ.15 లక్షల వరకు ఖర్చు చేసి నూతన తరగతి గదులను నిర్మించినట్లు తెలిపారు. ఈ కళాశాలలో ఇంటర్‌ ఫలితాల్లో 1000 మార్కులకు 980కి పైగా సాధిస్తే రూ.లక్ష నగదు బహుమతి అందజేస్తానని ప్రకటించారు. డీఐఈవో సునీత, ఆత్మకూరు, నందికొట్కూరు, పాములపాడు జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాళ్లు సుంకన్న, రఘురామాచార్యులు, వెంకటేశ్వర్లు ఉన్నారు.

Updated Date - Jul 31 , 2025 | 12:15 AM