Share News

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

ABN , Publish Date - Jul 31 , 2025 | 12:18 AM

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య చెప్పారు.

అర్హులందరికీ సంక్షేమ పథకాలు
పీరుసాహేబ్‌ పేట గ్రామంలో కరపత్రాన్ని అందిస్తున్న ఎమ్మెల్యే

మిడుతూరు, జూలై 30(ఆంధ్రజ్యోతి): అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య చెప్పారు. మం డలంలోని పీరుసాహేబ్‌ పేట గ్రామంలో బుధవారం ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే టీడీపీ గ్రామ నాయకులు సోమసుందర్‌ రెడ్డి, రామేశ్వరరెడ్డి, వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ కరపత్రాలను అందచేశారు. గ్రామంలో ఉన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సమస్యను పరిస్కరించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ కాతా రమేష్‌ రెడ్డి, నాయకులు శివరామిరెడ్డి, బీజేపీ రాజారెడ్డి, జయరాముడు, మహేశ్వరరెడ్డి, షబ్బుబాషా, వివిధ గ్రామాల నాయకులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 31 , 2025 | 12:18 AM