టీడీపీ వల్లే సీమ సస్యశ్యామలం
ABN , Publish Date - Jul 29 , 2025 | 12:46 AM
రాయలసీమలో దివంగత నందమూరి తారకరామారావు, బుడ్డా వెంగళరెడ్డి, నేడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి వల్లే సాగు నీటి ప్రాజెక్టులు నిర్మించటంతో సీమ సస్యశ్యామలంగా ఉందని మైనార్టీ, న్యాయ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూఖ్, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు.

బండిఆత్మకూరు, జూలై 28(ఆంధ్రజ్యోతి): రాయలసీమలో దివంగత నందమూరి తారక రామారావు, బుడ్డా వెంగళరెడ్డి, నేడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి వల్లే సాగు నీటి ప్రాజెక్టులు నిర్మించటంతో సీమ సస్యశ్యామలంగా ఉందని మైనార్టీ, న్యాయ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. మండలంలోని ఎర్రగుంట్ల గ్రామంలో సోమవారం రాత్రి సుపరిపాలన, తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ప్రజలకు కూటమి ప్రభుత్వం అందిచిన పథకాలు, ఇవ్వాల్సిన పథకాలగురించి వివరించారు. అనంతరం జరిగిన సభలోవారు మాట్లాడుతూ నాడు తెలుగుగంగ, ఎస్సార్బీసీ , హంద్రీ,నీవా, గాలేరు నగరి, అలగనూరు రిజర్వాయర్, పోతిరెడ్డిపాడు, బనకచర్ల హెడ్‌రెగ్యులేటర్లు నిర్మంచటంతోనే సీమకు సాగు నీరు అంది సశ్యశ్యామలంగా ఉందన్నారు. కెసీ కెనాల్ ప్రాజెక్టు చైర్మన్ రామలింగారెడ్డి, తెలుగుగంగ వైస్ చైర్మన్ మనోహర్ చౌదరి, రమణారెడ్డి, డి.సిద్ధయ్య, జగన్మోహన్‌రెడ్డి, రఘుస్వామిరెడ్డి, డాక్టర్ భరధ్వాజశర్మ, నరసింహారెడ్డి, సురేష్‌రెడ్డి, మండల కన్వీనర కృష్ణారెడ్డి, క్టస్టర్ ఇన్‌చార్జి చిన్న లింగారెడ్డి, తాటికొండ బుగ్గరాముడు, సర్పంచ్‌లు రామచంద్రుడు, శ్వేతకుమారి, ప్రసాద్ పాల్గొన్నారు.
పగిడ్యాల: రాష్ట్రాభివృద్ధే ధేయ్యంగా సీఎం చంద్రబాబు పాలన కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. బీరవోలు, ఆంజనేయ నగర్ గ్రామాల్లో సోమవారం ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. సింగిల్‌విండో చైర్మన్ దామోదార్‌రెడ్డి, టీడీపీ నాయకులు వాసురెడ్డ్డి, విజయ్ కుమార్, లక్ష్మాపురం షమిన్, శ్రీనివాసులు, రామకృష్ణగౌడ్, హనుమన్న తదితరులు ఉన్నారు.
మిడుతూరు: సుంకేసుల గ్రామంలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, గ్రామ నాయకుడు భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి, నాయకులు సర్వోత్తమ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, సుబ్బారావు, వెంకటయ్య, పుల్లయ్య, షబ్బు బాషా, నరసింహగౌడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.