రూ. 2.5 కోట్లు మంజూరు
ABN , Publish Date - Apr 26 , 2025 | 01:00 AM
గోరుకల్లు రిజర్వాయర్ రూ. 2.50 కోట్లు మంజూరయ్యాయని, త్వరలో తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నట్లు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత తెలిపారు.

పాణ్యం, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): గోరుకల్లు రిజర్వాయర్ రూ. 2.50 కోట్లు మంజూరయ్యాయని, త్వరలో తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నట్లు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత తెలిపారు. గోరుకల్లు రిజర్వాయర్ అవుట్‌పాల్ రెగ్యులేటర్ వద్ద కుంగిన రాతిపరుపును శుక్రవారం ఆమె పరిశీలించారు. గౌరు చరిత మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో రిజర్వాయర్ పట్టించుకోలేదన్నారు. ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రీన్‌కో సంస్థ ద్వారా రూ.కోటితో పనులు చేపట్టినట్లు తెలిపారు. రూ.56 కోట్లతో ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. ఎక్స్‌పర్ట్ కమిటీ సూచనల మేరకు మళ్లీ ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. పాణ్యం, బనగానపల్లె ప్రాంతాలలో ఇంకా మొక్కజొన్న, వరి పంటలు ఉన్నాయని, ఎస్సార్బీసీ కాలుకు నీరు నిలిపివేయడంతో సాగుకు ఇబ్బంది ఏర్పడిందని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం వరదల విపత్తు పనుల్లో భాగంగా బ్లాక్ 1 నుంచి బ్లాక్ 7 వరకు సీపెంట్ కాంక్రీట్ పనులు జరుగుతున్నాయన్నారు. రైతుల వినతుల మేరకు పంటలు పూర్తయిన తర్వాతే కాలువ పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈఈ శుభకుమార్, డీఈ జ్యోతి, టీడీపీ మండల కన్వీనర్ జయరామిరెడ్డి, ఎంపీటీసీ రంగరమేష్, నాయకులు ఖాదర్ బాషా, రామ్మోహన్‌నాయుడు, అమరసింహారెడ్డి, రవి, గంగ నారాయణ, సునీల్, దానం, ప్రభాకర్, రామసుబ్బయ్య, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
విద్యుత్ ప్రమాదంలో పంటలు కోల్పోయిన రైతులను ఆదుకోవాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత కలెక్టరు రాజకుమారిని కోరారు. శుక్రవారం ఎమ్లెల్యే పాణ్యంలో విద్యుత్ ప్రమాదంలో అగ్నికి ఆహుతైన మొక్కజొన్న పంటలను పరిశీలించారు. అనంతరం పంట నష్టాన్ని బాధిత రైతులు లింగమయ్య, సుబ్రహ్మణ్యం, మద్దిలేటిని అడిగి తెలుసుకున్నారు. ఎకరాకు రూ. 50 వేలు నష్టపోయామని రైతులు తెలిపారు. కలెక్టరును కలిసి బాధిత రైతులను ఆదుకోవాలని కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం ఎస్పీ అధిరాజ్ సింగ్‌ను కలిసి పెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.
పాణ్యం, గోరుకల్లు రహదారికి అదనంగా మరో రూ. 79 లక్షలు మంజూరైనట్లు ఎమ్మెల్యే గౌరు చరిత తెలిపారు. పాణ్యం ఎంపీడీవో కార్యాలయంలో సమస్యల పరిష్కార వేదికను ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ పాణ్యం, గోరుకల్లు ఎస్సార్బీసీ ర హదారి బీటీ రోడ్డుకు రూ. 5.50 కోట్లు మంజూరు కాగా ఇప్పటికే పనులు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, తహసీల్దారు నరేంద్ర నాథ్ రెడ్డి, సీఐ కిరణ్‌కుమార్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.