పార్టీ కోసం పని చేసిన వారికి ప్రాధాన్యం
ABN , Publish Date - Apr 29 , 2025 | 01:12 AM
పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు ప్రాధాన్యం ఉంటుందని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా అవకాశం ఉంటుందని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.

నందికొట్కూరు, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు ప్రాధాన్యం ఉంటుందని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా అవకాశం ఉంటుందని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. సోమవారం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో టీడీపీ నందికొట్కూరు విస్తృతస్థాయి సమావేశం నిర్వహిం చారు. ఈ సమావేశంలో క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్‌చార్జిలు పాల్గొన్నారు. ఎమ్మెల్యేతో పాటు పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు దేవళ్ల మురళి హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని బూత్‌లలో కుటుంబ సాధికార సారధులను నియమించి, గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో కమిటీలను త్వరితగతిన ఏర్పాటు చేయాలని సూచించారు. తద్వారా పార్టీ బలోపేతం అవుతుందన్నారు. దేవళ్ల మురళి మాట్లాడుతూ నందికొట్కూరులో గత ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి 20 ఏళ్ల క్రితం నాటి చరిత్రను తిరగరాశామన్నారు. అందుకు నాయకుడు మాండ్ర శివానందరెడ్డి సూచనలు, కార్యకర్తల అనుసరనే కారణమని ఆయన న్నారు. నందికొట్కూరు మార్కెట్ యార్డు చైర్మన్ వీరం ప్రసాద్‌రెడ్డి, యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు యాదవ్, టీడీపీ నాయులు ముర్తుజావలి, పలుచాని మహేశ్వరరెడ్డి, గిరీశ్వరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.