రజత గజ వాహనంపై ప్రహ్లాదరాయలు
ABN , Publish Date - Nov 21 , 2025 | 12:20 AM
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు రజత గజవాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు.
మంత్రాలయం, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు రజత గజవాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. గురువారం రాఘవేద్రస్వామి సజీవ సమాధి పొందిన శుభదినం, అమావాస్యను పురస్కరించుకుని పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచే రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణాలు, మంగళ వాయిద్యాల మధ్య రజిత గజవాహనంపై స్వర్ణ అంబారిలో ప్రహ్లాదరాయలను అధిష్టించి ఆలయ ప్రాంగణ ం చుట్టూ ఊరేగించారు.
రాఘవరాయలకు స్వర్ణ కవచ సమర్పణ సేవ
వేద పండితుల మంత్రోచ్ఛరణాలు, మంగళవాయిద్యాల మధ్య రాఘవ్రేంద స్వామి మూల బృందావనానికి బంగారు కవచ సమర్పణ సేవ చేశారు. రాఘవేంద్రస్వామి సజీవ సమాధి పొందిన గురువారం కార్తీక అమావాస్యను పురస్కరించుకొని పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆధ్వర్యంలో మఠం పండితులు బృందావనానికి సుప్రభాతం, నిర్మల విసర్జనం, క్షీరాభిషేకం, తులసి అర్చన, విశేష పంచామృతాభిషేకం నిర్వహించారు. బంగారు, వెండి, పట్టు వస్ర్తాలు, బెంగుళూరు నుంచి తెచ్చిన ప్రత్యేక పుష్పాలు, బంగారు కవచంతో అలంకరించారు. హాస్తోదకం చేసి మహా మంగళహారతులు ఇచ్చారు.