ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం
ABN , Publish Date - Apr 25 , 2025 | 01:33 AM
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని గురువారం పాణ్యం ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

పాణ్యం, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని గురువారం పాణ్యం ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొదట సర్పంచ్ పల్లవి ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. అనంతరం పంచాయతీ రాజ్ శాఖ నిర్వహణపై పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లు, సచివాలయ సిబ్బంది, ఎంపీటీసీలు, అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యదర్శులు, గ్రీన్ అంబాసిడర్‌లు, ఎంపీటీసీలు, ఎంపీడీవోను సన్మానించారు. అనంతరం సర్పంచ్‌లు, కార్యదర్శులు, అధికారులకు స్నేహపూర్వక ఆటల పోటీలు నిర్వహించారు. ఎంపీపీ ఉశేన్‌బీ, డిప్యూటీ ఎంపీడీవో చంద్రమౌళీశ్వరగౌడ్, సూపరింటెండెంట్ వరలక్ష్మి, సీనియర్ అసిస్టెంట్ రమణయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
పాములపాడు: పాములపాడులోని ఎంపీడీవో కార్యాలయంలో జాతీయ పంచాయతీరాజ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ సరోజినీ వర్జీనీయా, ఎంపీడీవో చంద్రశేఖర్ మహాత్మా గాంధీ, అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ భాగ్యమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.
వెలుగోడు: వెలుగోడులోని సచివాలయం-1లో గురువారం పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి డీపీవో జమీవుల్లా పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సచివాలయ సిబ్బంది, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
ఆత్మకూరు రూరల్: ఆత్మకూరు మండలంలోని అన్ని గ్రామాల్లోని సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో గురువారం ఆయా సచివాలయాలలో పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఉపాఽధి హామి పథకంలో పనిచేస్తున్న కూలీలను, పలువురు సిబ్బందిని ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయా సచివాలయాలలో ఏర్పాటు చేసిన సమావేశాలలో వారు మాట్లాడుతూ.. కార్యక్రమాలలో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు, గ్రామస్థులు పాల్గొన్నారు.