Share News

వైభవంగా నగర సంకీర్తన

ABN , Publish Date - Jul 29 , 2025 | 12:50 AM

మహానంది క్షేత్రంలో సోమవారం ఉదయం సమరతసేవా భక్త బృందం నగర సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు.

వైభవంగా నగర సంకీర్తన
మహానందిలో నగర సంకీర్తన చేస్తున్న భక్త బృందం

మహానంది, జూలై 28 (ఆంధ్రజ్యోతి): మహానంది క్షేత్రంలో సోమవారం ఉదయం సమరతసేవా భక్త బృందం నగర సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాన ఆలయం ముందు భక్తిశ్రద్ధలతో భజనలు చేశారు. అనంతరం ఆలయ మాడవీధుల గుండా భజనలు చేస్తూ నగర సంకీర్తనను చేశారు. ప్రధాన ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు. మండలంలోని సేవా కార్యకర్తలు పాల్గొన్నారు.

మహానంది క్షేత్రంలో సోమవారం రాత్రి పల్లకీ సేవను ఆలయ వేదపండితులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఇన్‌చార్జి పర్యవేక్షకుడు పసుపుల సుబ్బారెడ్డి, అర్చకులు పాల్గొన్నారు.

Updated Date - Jul 29 , 2025 | 12:50 AM