Manchu Manoj: తలసేమియా బాధితులకు అండగా ఉంటాం: మంచు మనోజ్
ABN , Publish Date - Nov 20 , 2025 | 03:04 PM
తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులను చూసి మనసు భారంగా మారిందని హీరో మంచు మనోజ్ అన్నారు. ఆ చిన్నారులకు అండగా ఉంటామని తెలిపారు.
కర్నూలు, నవంబర్ 20: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆవరణలో నందమూరి మోక్షజ్ఞ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్, తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కర్నూలులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హీరో మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి దంపతులు హాజరయ్యారు. ఇందులో భాగంగా మంచు మనోజ్ రక్తదానం చేశారు. అనంతరం మనోజ్ మీడియాతో మాట్లాడుతూ.. అన్నయ్య బాలకృష్ణ అభిమానులు తమ్ముడు మోక్షాజ్ఞ పేరుతో తలసేమియా బాధితుల కోసం రక్తదానం శిబిరం ఏర్పాటు చేయడం చాలా సంతోషమన్నారు.
ఏమీ తెలియని వయసులో చిన్నారులు తలసేమియా వ్యాధితో బాధపడటాన్ని చూసి మనసు భారంగా మారిందని ఆవేదన చెందారు. తలసేమియా బాధితులకు 15 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించాలని.. కొంతమంది పిల్లలు రక్తం అందక చనిపోతున్నారన్నారు. తలసేమియా బాధితులకు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. టెర్రరిజమ్ ఒక సైడ్ నుంచే రాదని... అది ఎన్నో విధాలుగా వస్తుందన్నారు. డ్రగ్స్ వాడకం వల్ల ఆ డబ్బు టెర్రరిజానికి వెళ్తుందని.. డ్రగ్స్ నుంచి మన పిల్లలను కాపాడుకోవాలని మంచు మనోజ్ పేర్కొన్నారు.
ఆ బాధ్యత అందరిదీ: భూమా మౌనిక
తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను చూస్తే బాధేస్తోందని భూమా మౌనిక రెడ్డి అన్నారు. తలసేమియా బాధితుల కోసం రక్తదానం చేసి వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి..
ఘోరం... కల్వర్టులో చిన్నారి శరీర భాగాలు
ఆపరేషన్ సంభవ్ కొనసాగుతుంది.. ఏపీ డీజీపీ స్పష్టం
Read Latest AP News And Telugu News