Share News

v

ABN , Publish Date - Jul 31 , 2025 | 12:13 AM

మండలంలోని పైబోగుల గ్రామ సమీపంలో ఉన్న సోలార్‌ పరిశ్రమలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వలేదని జాతీయ ఎస్టీ కమిషన్‌కు రైతులు ఫిర్యాదు చేయడంతో బుధవారం తహసీల్దార్‌ వెంకటరమణ విచారణ చేపట్టారు.

v
విచారిస్తున్న అధికారులు

గడివేముల, జూలై 30 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పైబోగుల గ్రామ సమీపంలో ఉన్న సోలార్‌ పరిశ్రమలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వలేదని జాతీయ ఎస్టీ కమిషన్‌కు రైతులు ఫిర్యాదు చేయడంతో బుధవారం తహసీల్దార్‌ వెంకటరమణ విచారణ చేపట్టారు. క్షేత్రస్థాయికి వెళ్లి భూములను పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి వారి వివరాలను సేకరించారు. ఉన్నతాధికారులకు నివేదికలు అందజేస్తామని తెలిపారు. గిరిజన ప్రజాసమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజునాయక్‌ మాట్లాడుతూ చెనకపల్లి రెవెన్యూ గ్రామంలోని సర్వే నంబర్‌ 795, 797, 802లో రైతులకు ప్రభుత్వం పట్టాలను మంజూరు చేసి 1-బీ అడంగల్‌ను ఇచ్చిందని అన్నారు. రైతులు పూర్వం నుంచి భూముల్లో సాగు చేసుకుంటున్నారని అన్నారు. బాధిత రైతులకు నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ వెంకటరమణను కోరారు.

Updated Date - Jul 31 , 2025 | 12:13 AM