Share News

‘హామీలను విస్మరించిన ప్రభుత్వం’

ABN , Publish Date - Jul 29 , 2025 | 12:42 AM

ఇచ్చిన హామలను ప్రభుత్వం విస్మరించిందని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి ఆరోపించారు.

‘హామీలను విస్మరించిన ప్రభుత్వం’
నంద్యాలలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్‌రెడ్డి

నంద్యాల రూరల్‌, జూలై 28 (ఆంధ్రజ్యోతి): ఇచ్చిన హామలను ప్రభుత్వం విస్మరించిందని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి ఆరోపించారు. పట్టణంలోని రోజాకుంట ఎన్టీఆర్‌ షాదీఖానాలో 30,40,41,42వ వార్డు ప్రజలతో సోమవారం ‘బాబు షూరిటీ మోసం గ్యారెంటీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తుందన్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మాబున్నీసా, వైస్‌చైర్మెన్‌ గంగిశెట్టి శ్రీధర్‌, వైసీపీ జనరల్‌ సెక్రెటరీ శశికళారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆత్మకూరు: సూపర్‌ సిక్స్‌ హామీల అమల్లో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని శ్రీశైలం నియోజకవర్గం వైసీపీ నాయకులు శిల్పా భువనేశ్వరరెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని గరీబ్‌నగర్‌లో బాబు షూరిటీ.. మోసం గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల ముందు సూపర్‌ సిక్స్‌ పథకాల పేరుతో లేనిపోని హామీలు ఇచ్చిన సీఎం చంద్రబాబు నేడు వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు సయ్యద్‌మీర్‌, అంజాద్‌అలి, విజయ్‌చౌదరి, మారుబత్తుల విజయకుమార్‌, జయకృష్ణ, బాలస్వామియాదవ్‌, మోమిన్‌ ముస్తఫా, మునీర్‌బాషా తదితరులు ఉన్నారు.

Updated Date - Jul 29 , 2025 | 12:42 AM