ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
ABN , Publish Date - Nov 21 , 2025 | 11:44 PM
మంత్రాలయం నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తీర్చేందుకు ప్రజలకు నిరంతరం అందుబాటలో ఉంటూ కృషి చేస్తానని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి రాఘవేంద్రరెడ్డి అన్నారు.
మంత్రాలయం, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): మంత్రాలయం నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తీర్చేందుకు ప్రజలకు నిరంతరం అందుబాటలో ఉంటూ కృషి చేస్తానని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి రాఘవేంద్రరెడ్డి అన్నారు. శుక్రవారం మాధవరం తన నివాసంలో ప్రజాదర్భార్ నిర్వహించారు. నియోజకవర్గంలోనే చాలా మంది అర్జీలు ఇచ్చేందుకు క్యూ కట్టారు. అర్జీలను తీసుకుంటూ అధాకారులతో ఫోన్‌లో మాట్లాడుతూ కొన్ని సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఏ కష్టం, సమస్యలు వచ్చినా తనకు గాని తన సోదరులు రఘునాథ్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, తనయుడు రాకేష్‌రెడ్డి దృష్టికి తెచ్చిన వెంటనే పరిష్కరించి న్యాయం చేస్తామన్నారు. భూసమస్యలు, రెవెన్యూ, సీసీరోడ్లు, డ్రైనేజీ సమస్యలు, ఫించన్‌లు, ఇంటి స్థలాలు అధికంగా ఉన్నాయని తెలిపారు. టీడీపీ మండల అధ్యక్షుడు ఎస్‌ఎం గోపాల్‌రెడ్డి, రాజారెడ్డి, ప్లానింగ్ అధికారి రాజు, టీడీపీ నాయకులు గోపాల్, శివ, లక్ష్మన్న, రామయ్య, పోలి వీరేశ్, బొజ్జప్ప, కేశన్న, కార్యకర్తలు పాల్గొన్నారు.