నిత్యాన్నదాన పథకానికి విరాళం
ABN , Publish Date - Apr 29 , 2025 | 01:09 AM
మహానంది క్షేత్రంలో భక్తుల కోసం దేవస్థానం అమలు చేస్తున్న నిత్యాన్నదాన పథకానికి ఆత్మకూరుకు చెందిన పోగుల లక్ష్మీదేవి రూ.లక్ష విరాళం అందచేసినట్లు ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి తెలిపారు.

మహానంది, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): మహానంది క్షేత్రంలో భక్తుల కోసం దేవస్థానం అమలు చేస్తున్న నిత్యాన్నదాన పథకానికి ఆత్మకూరుకు చెందిన పోగుల లక్ష్మీదేవి రూ.లక్ష విరాళం అందచేసినట్లు ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం దేవస్థానం పరిపాలన భవనంలో దాతకు స్వామి వారి ప్రసాదాలు, శాలువాతో సన్మానించారు. అనంతరం ఈవో మెమెంటోను అందజేశారు. కార్యక్రమంలో ఏఈవో యర్రమల్ల మధు, క్యాషియర్ నాగభూషణంతో పాటు అన్నదానం ఇన్‌చార్జి రామశివ పాల్గొన్నారు.