పింఛన్లు పెంచిన ఘనత చంద్రబాబుదే
ABN , Publish Date - Aug 02 , 2025 | 01:10 AM
ఛన్లు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే దక్కుతుందని మైనార్టీ, న్యాయ, సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, పార్టీ రాష్ట్ర పరిశీలకుడు, టీడీపీ అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు అన్నారు.

నంద్యాల రూరల్, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): పింఛన్లు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే దక్కుతుందని మైనార్టీ, న్యాయ, సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, పార్టీ రాష్ట్ర పరిశీలకుడు, టీడీపీ అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు అన్నారు. నంద్యాల మండలం అయ్యలూరు గ్రామంలో టీడీపీ ఇన్‌చార్జి, మాజీ సర్పంచ్ త్రిలింగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన పింఛన్ల పంపిణీలో మాట్లాడారు. లబ్ధిదారుల కళ్లల్లో చాలా ఆనందం చూశామ న్నారు. టీడీపీ నాయకులు కె.ప్రతాప్‌రెడ్డి, రాయపురెడ్డి, హుస్సేన్‌వలి, వీరభద్రుడు, సర్పంచ్ ఓబులేసు, మాజీ సర్పంచ్ శ్రీన, టీడీపీ మండల కన్వీనర్ విశ్వనాథరెడ్డి, కేసీ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ చాబోలు ఇలియాస్ పాల్గొన్నారు.
నందికొట్కూరు రూరల్: ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకోంటోందని నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య అన్నారు. శుక్రవారం ఇంటివద్దకే వెల్లి ఎన్‌టీఆర్ భరోసా ద్వారా మంజూరైన స్పౌజ్ పెన్షన్లను ఎమ్మెల్యే జయసూర్య, మాండ్ర సురేంద్రనాథరెడ్డి పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ చిన్న నాగలక్ష్మయ్య, సచివాలయ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.