తల్లిపాలతో బిడ్డకు ఆరోగ్యం
ABN , Publish Date - Aug 02 , 2025 | 01:16 AM
తల్లిపాలతో బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని ఐసీడీఎస్ సీడీపీవో టీఎంఆర్ చంద్రకళ అన్నారు.

నంద్యాల రూరల్, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): తల్లిపాలతో బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని ఐసీడీఎస్ సీడీపీవో టీఎంఆర్ చంద్రకళ అన్నారు. నంద్యాల ఉప్పరిపేటలోని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో శుక్రవారం తల్లిపాల వారోత్సవాలను ప్రారంభించారు. సీడీపీవో మాట్లాడుతూ తల్లిపాలు శ్రేష్టమని, వీటిని తాగడం వల్ల బాలలకు ఎలాంటి ప్రాణాంతక వ్యాధులు దరిచేరవని చెప్పారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్లు విజయలక్ష్మి, సుజాత, త్రివేణి, కుమారి, కళావతి, ఆరోగ్యమ్మ, శివకుమారి, హేమలత తదితరులు పాల్గొన్నారు.
నందికొట్కూరు: తల్లిపాలు బిడ్డకు సంపూర్ణ పోషకాహార మని మున్సిపల్ కమిషనర్ బేబి అన్నారు. పట్టణంలో స్త్రీ శిశు సంక్షేమశాఖ సీడీపీవో మంగవళ్లి ఆధ్వర్యంలో శుక్రవారం తల్లిపాల వారోత్సవాలపై ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం జైకిసాన్ పార్కులో సమావేశం నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ అపోహలు, ఉద్యోగ అవసరాలు, ఇతరత్రా కారణాలతో చాలా మంది తల్లులు బిడ్డలకు పోతపాలు పడుతున్నారన్నారు. అలా కాకుండా ప్రతి తల్లి తన పాలను పుట్టిన అరగంటలోపే బిడ్డకు పట్టాలని ఆమె సూచించారు.