Share News

శ్రీమఠంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు

ABN , Publish Date - Oct 22 , 2025 | 11:54 PM

మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో శ్రీమఠాన్ని అభివృద్ధి చేస్తూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ అన్నారు.

శ్రీమఠంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు
పీఠాధిపతితో కలసి శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న కర్ణాటక ప్రజాప్రతినిధులు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి

మంత్రాలయం, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో శ్రీమఠాన్ని అభివృద్ధి చేస్తూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ అన్నారు. బుధవారం గోశాలను సందర్శించి సతీసమేతంగా గోపూజ నిర్వహించారు. పుష్కరిణి కారిడార్‌లను అభివృద్ధి పనులను తిలకించారు. సాయంత్రం పరిమళ షాపింగ్‌ కాంప్లెక్స్‌ వెనక భాగంలో శ్రీమఠం ఈఈ సురేష్‌కోణాపూర్‌, ఏఈ బద్రీనాథ్‌ ఆధ్వర్యంలో పీఠాధిపతితో కలిసి మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి రూ. 10కోట్లతో మూడంతస్తుల డార్మెంటరీ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించి పనులను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాహుల్‌ జోడో యాత్రలో మంత్రాలయానికి వచ్చి దర్శించుకోవడంతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చామని తెలిపారు. రాజా ఎస్‌ అప్రమేయాచార్‌, కృష్ణకౌశిక్‌, ఏఏవో మాధవశెట్టి, టీడీపీ నాయకులు పన్నగ వెంకటేశ్‌, పూజారి వ్యాసరాజాచార్‌, అమర్నాథరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, భరద్వాజ్‌శెట్టి తదితరులు పాల్గొన్నారు.

దర్శించుకున్న తిక్కారెడ్డి: గ్రామదేవత మంచాలమ్మను, రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి దర్శించుకున్నారు. ఎస్‌ఐ శివాంజల్‌, టీడీపీ నాయకులు నరసింహ, యేబు, సుంకప్ప, నర్సారెడ్డి, నాగరాజు, గురురాజు ఉన్నారు.

Updated Date - Oct 22 , 2025 | 11:54 PM