Share News

మలేరియాతో అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Apr 26 , 2025 | 12:54 AM

మలేరియాతో అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటరమణ సూచించారు.

మలేరియాతో అప్రమత్తంగా ఉండాలి
ర్యాలీ చేస్తున్న వైద్యాధికారులు, సిబ్బంది

నంద్యాల హాస్పిటల్‌, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): మలేరియాతో అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటరమణ సూచించారు. ప్రపంచ మలేరియా నివారణ దినం సందర్భంగా శుక్రవారం పట్టణంలోని జిల్లా మలేరియా నివారణ అధికారి కామేశ్వర రావు ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. డీఎంహెచ్‌వో జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం దోమల అంతం ఆరోగ్యశాఖ పంతం అని ప్రతిజ్ఞ చేశారు. జిల్లా అదనపు వైద్యఆరోగ్య శాఖ అధికారి శారదాబాయి, జిల్లా వ్యాధినిరోధక టీకా అధికారి డా.సుదర్శన్‌బాబు, జిల్లా ప్రోగ్రాం మానిటరింగ్‌ అధికారి డా.అంకిరెడ్డి, వైద్యులు కాంతారావునాయక్‌, భరత్‌కుమార్‌, శ్రీజ, రవీంద్రనాయక్‌, మలేరియా నివారణ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2025 | 12:57 AM