Good News: ఏపీలో నాయీ బ్రాహ్మణులకు ప్రభుత్వం గుడ్ న్యూస్....
ABN , Publish Date - Apr 29 , 2025 | 10:08 AM
నాయీ బ్రాహ్మణులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నెల వారీ భృతిని రూ. 20 వేల నుంచి రూ. 25 వేలకు పెంచుతూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దేవాలయాల్లో నాయీ బ్రాహ్మణులకు మేలు కలిగేలా కూటమి ప్రభుత్వ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 44 దేవాలయాలకు ఈ జీవో వర్తించనుంది.

నంద్యాల: ఏపీ (AP)లో నాయీ బ్రాహ్మణులకు (Nai Brahmins) కూటమి ప్రభుత్వం (Kutami Govt) ఇచ్చిన హామీ (Promises) మేరకు గౌరవ వేతనం రూ. 20 వేల నుంచి రూ. 25 వేలకు పెంచుతూ జీఓ 130 (GO 130) విడుదలపై వారు హర్షం వక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు (CM Chandrababu) కృతజ్ఞతలు తెలిపారు. నాయీ బ్రాహ్మణుల గౌరవ వేతనం పెంచిన సందర్భంగా శ్రీశైలంలోని శ్రీ స్వామి అమ్మవార్లకు 501 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. నాయీ బ్రాహ్మణులకు కూటమి ప్రభుత్వం నెల వారీ భృతిని రూ. 20 వేల నుంచి రూ. 25 వేలకు పెంచుతూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దేవాలయాల్లో నాయీ బ్రాహ్మణులకు మేలు కలిగేలా కూటమి ప్రభుత్వ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 44 దేవాలయాలకు ఈ జీవో వర్తించనుంది.
Also Read: గ్రూప్ -1లో పీఎస్సార్ చేసిన అక్రమాలపై కేసు
హామీల్ని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అహర్నిశలు కృషి చేస్తోంది. అన్ని వర్గాల ప్రజల బాగు కోసం పరితపిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు వెళుతోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా రంజకమైన పాలనను అందిస్తూ.. అందరితో శభాష్ అనిపించుకుంటోంది. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం నాయీ బ్రహ్మణులకు శుభవార్త చెప్పింది. దేవాలయాల్లో నాయీ బ్రాహ్మణులకు మేలు కలిగేలా నిర్ణయం తీసుకుంది. జీతాల పెంపు విషయంలో దేవాదాయ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
రూ. 20 వేల నుంచి రూ. 25 వేలకు..
ఇటీవల నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయీ బ్రాహ్మణులకు భృతిని పెంచాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే నెలవారీ భృతిని రూ. 25 వేలకు పెంచుతూ దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 44, 6ఏ కేటగిరీ దేవాలయాల్లో కేశఖండన చేస్తున్న నాయీ బ్రాహ్మణులకు వర్తించేలా ఈ జీవో జారీ చేసింది. నెలవారీ భృతిని 20 వేల రూపాయల నుంచి 25 వేల రూపాయలకు పెంచుతూ దేవాదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. కనీస మొత్తంగా 25 వేల రూపాయల భృతిని నాయీ బ్రాహ్మణులకు అందేలా నిర్ణయం తీసుకుంది.
ఏడాదికి రూ.50 లక్షల నుంచి రూ. 2 కోట్ల ఆదాయం వచ్చే ఆలయాలు 6ఏ కేటగిరీలోకి వస్తాయి. ఆలయాలకు భారీగా ఆదాయం వస్తున్నప్పటికీ తమకు అతి తక్కువ కమిషన్ మాత్రమే ఇస్తున్నారని, దానిని పెంచాలని ఎప్పటి నుంచో నాయీ బ్రాహ్మణులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై నాయీ బ్రాహ్మణ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
పాకిస్థాన్ దేశస్థులు భారత్‌ను వీడేందుకు చివరి రోజు..
చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య కేసులో హైడ్రామా
For More AP News and Telugu News