Share News

ప్రతిష్టాత్మకంగా ‘మధ్యాహ్న భోజనం’ అమలు

ABN , Publish Date - Aug 02 , 2025 | 01:14 AM

డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు.

ప్రతిష్టాత్మకంగా ‘మధ్యాహ్న భోజనం’ అమలు
విద్యార్థులకు భోజనం వడ్డిస్తున్న మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి

నందికొట్కూరు, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని 24వ వార్డులో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో దాతల సహకారం రూ.4.10 లక్షలతో విద్యార్థులు భోజనం చేసేందుకు నిర్మించిన భోజనశాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. బైరెడ్డి విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల కోసం ప్రతి ప్రభుత్వ పాఠశాలలో దాతల సహకారంతో ఇలాంటి భోజనశాల ఏర్పాటు చేస్తే పరిశుభ్రమైన వాతావరణంలో విద్యార్థులు భోజనం చేసి, ఆరోగ్యంగా ఉంటారన్నారు. దాత ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ దాసి సుధాకర్‌రెడ్డి, దాత, కౌన్సిలర్‌ చాంద్‌బాషా, దక్షిణ మధ్య రైల్వే జోనల్‌ వినియోగదారుల కన్సల్టేట్‌ కమిటీ సభ్యులు నాగేశ్వరరావు, కట్టుబడి శ్రీనివాసులు, గుణశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. పట్టణంలోని 24వ వార్డులో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లను మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

Updated Date - Aug 02 , 2025 | 01:14 AM