Share News

ఓబులమ్మ చెరువును ఆక్రమిస్తే చర్యలు

ABN , Publish Date - Jul 27 , 2025 | 12:36 AM

: మండలంలోని సుగాలిమెట్ట సమీపంలోని ఓబులమ్మ చెరువును ఆక్రమిస్తే చర్యలు తప్పవని మైనర్‌ ఇరిగేషన్‌ ఏఈ చంద్రుడు హెచ్చరించారు.

ఓబులమ్మ చెరువును ఆక్రమిస్తే చర్యలు
చెరువు రికార్డులను పరిశీలిస్తున్న అధికారులు

పాణ్యం, జూలై 26(ఆంధ్రజ్యోతి): మండలంలోని సుగాలిమెట్ట సమీపంలోని ఓబులమ్మ చెరువును ఆక్రమిస్తే చర్యలు తప్పవని మైనర్‌ ఇరిగేషన్‌ ఏఈ చంద్రుడు హెచ్చరించారు. శనివారం ఓబులమ్మ చెరువు ను రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. 1638 సర్వే లోని ఓబులమ్మ చెరువు విస్తీర్ణం 8.09 ఎకరాలు ఉందన్నారు. కొందరు చెరువును ఆక్రమించడంతో వెంటనే ఆక్రమణలు తొలగించాలని హెచ్చ రించినట్లు తెలిపారు. ఈ మేరకు చెరువు హద్దులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలో చెరువు అభివృద్ధి పనులు చేపడతామ న్నారు. ఆర్‌ఐ రాము, వీఆర్వో శంకర్‌, సర్వేయరు సుబ్బయ్య పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2025 | 12:36 AM